‘లూసీఫర్’ రీమేక్ హీరోయిన్ ఫిక్స్: చిరంజీవి సరసన బాలీవుడ్ బ్యూటీ

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న చిత్రం 'ఆచార్య'. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. మెగా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇది షూటింగ్ జరుగుతోన్న సమయంలో చిరంజీవి పలు ప్రాజెక్టులను ప్రకటించారు. అందులో 'లూసీఫర్' రీమేక్ ఒకటి. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని మోహన్ రాజా తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసీఫర్' ఒరిజినల్‌లో హీరోయిన్ పాత్రే ఉండదు. అయితే, తెలుగు నేటివిటీకి అనుగుణంగా చిరంజీవి చేయబోయే రీమేక్‌లో ఆ పాత్రను జోడించారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే కొద్ది రోజులుగా ఎంతో మంది సీనియర్ జూనియర్ నటీమణుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా కోసం హీరోయిన్‌ను ఫిక్స్ చేశారని తెలిసింది. ఆమె ఎవరో కాదు.. చాలా కాలంగా బాలీవుడ్‌లో తనదైన సినిమాలతో సందడి చేస్తోన్న సీనియర్ హీరోయిన్ విద్యా బాలన్‌నే ఈ రీమేక్‌కు తీసుకున్నారని తెలుస్తోంది.

Vidya Balan Fix For Chiranjeevis Lucifer

విద్యా బాలన్ గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన 'యన్.టీ.ఆర్' బయోపిక్‌లో ఎన్టీఆర్ సతీమణి పాత్రను పోషించింది. దీని తర్వాత ఇప్పుడు మెగాస్టార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'లూసీఫర్' రీమేక్ ఆగస్టు 22 నుంచి ప్రారంభం కాబోతుందని అంటున్నారు. దీన్ని రామ్ చరణ్, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో హీరో చెల్లెలిగా ప్రియమణి గానీ, సుహాసిని కానీ నటించే అవకాశాలు ఉన్నాయని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X