Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమెజాన్‌లో శకుంతలాదేవి మూవీ రిలీజ్.. డేట్‌ను అనౌన్స్ చేసిన విద్యాబాలన్
గణిత శాస్త్ర పండితురాలు శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన శకుంతాల దేవి చిత్రం విడుదలకు సిద్ధమైంది. విద్య, గణితశాస్త్రంలో ప్రావీణ్యం ఆమెను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చేరేలా చేశాయి. అలాంటి ఉన్నతమైన విద్యావేత్త జీవితాన్ని శకుంతలాదేవీకి తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి రానందున్న ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. శకుంతలా చిత్రానికి నయనికా మహ్తానీతో కలిసి అను మీనన్ రచయితగా, ఇషితా మోయిత్రా డైలాగ్స్ అందించింది.
బాలలకు, యువతలో స్ఫూర్తిని నింపే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రాన్ని జూలై 31వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని విద్యాబాలన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. శకుంతలాదేవి మూవీ ప్రీమియర్లు జూలై 31న అమెజాన్ ప్రైమ్‌లో ప్రదర్శించబడుతాయి అని విద్యాబాలన్ పేర్కొన్నారు.
శకుంతలా దేవి పాత్రను పోషించడం నాకు గర్వంగా ఉంది. ఉన్నతమైన విద్యావిలువలు ఉన్న శకుంతలాదేవి విజయాలను అందుకొనే క్రమంలో తనదైన పరిధిలో మహిళా సాధికారితను, ధైర్య సాహసాలను ప్రదర్శించారు. అనేక ఇబ్బందులను, సమస్యలను సులభంగా అధిగమించారు. అని అన్నారు. ఇటీవల రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.