పెళ్లి తరువాత ఏకంగా బికినీలో దర్శనమిచ్చిన లేడి కమెడియన్.. గ్లామర్ తో చంపేస్తోందిగా!

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో లేడీ కమెడియన్స్ గా గుర్తింపును అందుకున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో విద్యుల్లేఖ రామన్ ఒకరు. ఒకప్పుడు కోవై సరళ ఏ తరహాలో అయితే ఆకట్టుకున్నారో ప్రస్తుత జనరేషన్ లో కూడా విద్యుల్లేఖ రామన్ అదే తరహాలో సరికొత్త కామెడీ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తమిళనాడుకు చెందిన ఈ లేడీ కమెడియన్ 2012 నుంచి సౌత్ ఇండస్ట్రీ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. అయితే ఇంతకు ముందు చాలా లావుగా ఉన్నా ఆమె ఇప్పుడు మాత్రం ఎవరూ ఊహించని విధంగా కనిపిస్తోంది. తొలిసారి బికినీలో కనిపించడంతో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. పెళ్లి తర్వాత ఆమె గ్లామర్ డోస్ ను మరింతగా పెంచినట్లు తెలుస్తోంది.

 ఆ సినిమాతో కెరీర్ మొదలు..

ఆ సినిమాతో కెరీర్ మొదలు..

లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విద్యుల్లేఖ రామన్ తమిళం రచయిత నటుడు అయినటువంటి మోహన్ రామన్ కుమార్తె. 2012 నుంచి ఆమె తెలుగు తమిళ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. మొదట గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మంచి క్రేజ్ అందుకుంది.

ఒక్క సినిమాతో ఏకంగా 10 ఆఫర్స్

ఒక్క సినిమాతో ఏకంగా 10 ఆఫర్స్

అయితే విద్యుల్లేఖ రామన్ తమిళ్ ఇండస్ట్రీకి చెందినప్పటికి ఆమెకు ఎక్కువగా తెలుగులోనే ఆఫర్స్ వస్తున్నాయి. ఒకవైపు తమిళ సినిమాలు చేస్తూనే తెలుగులో చిన్న చిన్న అవకాశం వచ్చినా కూడా ఆమె రిజెక్ట్ చేయడం లేదు. ఒక విధంగా లా చేయడం వల్లనే విద్యుల్లేఖ కు భారీ స్థాయిలో క్రేజ్ తగ్గింది. ఎందుకంటే ఆ చిన్న సినిమాలే ఆమెకు కామెడీ యాంగిల్ లో చాలా హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా రాజు గారి గది సినిమాలో ద్వారా ఆమెకు తెలుగులో వరుసగా 10 ఆఫర్స్ వచ్చాయి.

 తెలుగులో భారీ హిట్స్

తెలుగులో భారీ హిట్స్

తెలుగులో రన్ రాజా రన్, డైనమెట్, సరైనోడు, ధ్రువ, దువ్వాడ జగన్నాథం, నిన్నుకోరి, గౌతమ్ నంద, రాజా ది గ్రేట్, తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, మహర్షి, వెంకీ మామ సినిమాల్లో విద్యుల్లేఖ చేసిన కామెడీ బాగా క్లిక్ అయ్యింది. ఏడాదికి వరుసగా 8 పైగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. ఇక చిన్న సినిమాల్లో పాత్రలు నచ్చితే ఆమె రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉంటుందట. ఒక విధంగా అదే ఆమెకు చాలా హెల్ప్ అయింది. అలా చేసిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి.

 ప్రేమ వివాహం..

ప్రేమ వివాహం..

ఇటీవల విద్యుల్లేఖ, సంజయ్ అనే ఫిట్నెస్ ట్రైనర్ ను పెళ్లి చేసుకుంది. గత ఏడాది ఆగస్టు 26న సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత విద్యుల్లేఖ రామన్ సోషల్ మీడియా ద్వారా ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకొని మరొక షాకిచ్చింది. సంజయ్ గత కొన్నాళ్లుగా ఫిట్ నెస్ ట్రైనర్ గా విద్యుల్లేఖ రామన్ కు చాలా క్లోజ్ గా ఉన్నాడు. ఆ ప్రయాణంలోనే వారి మధ్య ప్రేమ పుట్టింది.

Recommended Video

Malli Malli Chusa Movie Public Talk | Anurag Konidena | Shweta Avasthi
మొదటిసారి బికినీలో

మొదటిసారి బికినీలో

ఇక విద్యుల్లేఖ రామన్ ఎవరు ఊహించని విధంగా రీసెంట్ గా కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టింది. ఇక మొదటి సారి ఆమె ఏకంగా బికినీ లో కూడా దర్శనమిచ్చింది. పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పంచినట్లు తెలుస్తోంది. కానీ బికినీలో విద్యుల్లేఖ రామన్ ఈ విధంగా షాక్ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది.. మరి భవిష్యత్తులో విద్యుల్లేఖ రామన్ గ్లామరస్ పాత్రల్లో కూడా దర్శనమిస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X