For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లేడి కమెడియన్ విద్యుల్లేఖ పెళ్లి ఫొటోలు.. కత్తి లాంటి కుర్రాడిని టెంప్ట్ చేసిన చబ్బీ గర్ల్!

  |

  విద్యుల్లేఖ రామన్‌ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఎక్కువగా సినిమాలు చేస్తున్న లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు అందుకుంటోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర హైలెట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ ఫన్నీ గర్ల్ తెలుగు అమ్మాయి అని అందరూ అనుకుంటారు. కానీ తెలుగు అమ్మాయి కాదు. కానీ అతి తక్కువ కాలంలోనే తెలుగు వారందరికీ చాలా దగ్గరైన తమిళ అమ్మాయి. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. రీసెంట్ గా విద్యుల్లేఖ కత్తి లాంటి కుర్రాడిని పెళ్లి చేసుకుంది. అసలు పెళ్లి అయినట్లు ఎక్కువ మందికి తెలియదు. ఇక ఫోటోలు కూడా చాలా ఆలస్యంగా విడుదల చేశారు. ఇటీవల విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియా అయితే బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే..

  సరదాగా అలా చేయడంతో

  సరదాగా అలా చేయడంతో

  విద్యుల్లేఖ రామన్‌ మొదట అసలు సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. కానీ స్కూల్ దశలోనే ఆమె సరదాగా చేసిన కొన్ని హాస్యాస్పదమైన నాటకాలు బాగానే క్లిక్కయ్యాయి. ఆమె తండ్రి టెలివిజన్ రంగంలో అప్పటికే మంచి గుర్తింపును అందుకున్నారు రచయితగా కూడా ఆయనకి మంచి అనుభవం ఉంది. అలాగే పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎక్కువమంది లాయర్స్ ఉన్నారు.

   రజనీకాంత్ దగ్గరి బంధువే..

  రజనీకాంత్ దగ్గరి బంధువే..

  దర్శకుడు సెల్వరాఘవన్ విద్యులేఖ కజిన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇక అతని సోదరుడు ధనుష్ కూడా ఆమెకి దగ్గరి బంధువు. అంటే రజనీకాంత్ కూడా వారికి బంధువవుతారని చెప్పవచ్చు. సినిమాకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో కూడా ఆమె మాత్రం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఎవరి సపోర్ట్ లేకుండా తనకు తానే సొంతంగా అవకాశాలను కూడా రాబట్టుకుంది.

   ఎంత మంది నెగిటివ్ కామెంట్స్ చేసినా..

  ఎంత మంది నెగిటివ్ కామెంట్స్ చేసినా..

  విద్యుల్లేఖ కాస్త మోటుగా ఉండడంతో అందరూ చూసి వెక్కిరించేవారుట. కానీ చిన్నప్పటి నుంచి కూడా దాన్ని ఎప్పుడు కూడా నెగిటివ్ గా తీసుకోలేదు. తనపై తానే జోకులు వేసుకునేలా అందరినీ నవ్విస్తూ వచ్చింది. ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా ఆమె నెగిటివ్ గా తీసుకోలేదు. ఇక తండ్రి సలహా మేరకు ఆమె కమెడియన్ గా కొనసాగేందుకు అడుగులు వేసింది

   ఆ సినిమాలతో మంచి క్రేజ్

  ఆ సినిమాలతో మంచి క్రేజ్

  మొదట గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో సమంత స్నేహితురాలిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రామయ్య వస్తావయ్యా, రన్ రాజా రన్, సరైనోడు, రాజు గారి గది వంటి సినిమాలతో మంచి గుర్తింపు అనుకున్నారు. ప్రస్తుత విద్యుల్లేఖ చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి. తమిళ సినిమాల కంటే కూడా ఆమె ఎక్కువగా తెలుగు సినిమాలతో బిజీగా మారుతుంది.

  సైలెంట్ గా మ్యారేజ్ ఫినిష్

  సైలెంట్ గా మ్యారేజ్ ఫినిష్

  2020 ఆగస్టు 26న సంజయ్ తో ఎంగేజ్మెంట్ పూర్తిచేసుకున్న విద్యుల్లేఖ ఒక విధంగా అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆమె ప్రేమలో ఉన్నట్లు చాలామందికి తెలియదు. చాలా కాలంగా సంజయ్ తో స్నేహం గా ఉన్న ఆమె పెళ్లి వరకు వస్తుంది అని కూడా ఎవరూ ఊహించలేదట. ఇక ఫైనల్ గా వారిద్దరు సెప్టెంబర్ 9 హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారుమ్ అదికూడా చాలా సైలెంట్ గానే పూర్తి చేశారు.

   అందుకే అతన్ని పెళ్లి చేసుకుంది

  అందుకే అతన్ని పెళ్లి చేసుకుంది

  ఫిట్నెస్ విషయంలో మార్పులు తీసుకురావాలని ఆమె గత కొంత కాలంగా ఎంతగానో కష్టపడింది మొత్తానికి అనుకున్నట్లుగానే నార్మల్ సైజ్ లోకి వచ్చేసింది. అయితే ఆమె ఈ స్థాయికి రావడానికి ఫిట్నెస్ ట్రైనర్ సంజయ్ ఒక గురువు లాగా మారాడు. అతను చెప్పినట్లుగా కేవలం మూడు నాలుగు నెలల్లోనే విద్యుల్లేఖ తనను తాను ఎంతగానో మార్చుకుంది. జీవితంలో కూడా అతను తోడుగా ఉంటే మరింత స్ఫూర్తి తో ముందుకు వెళ్లవచ్చు అని అనుకున్న విద్యుల్లేఖ ఫైనల్ గా అతనిని పెళ్లి చేసుకుంది.

  Malli Malli Chusa Movie Public Talk | Anurag Konidena | Shweta Avasthi
  పెళ్లి ఫొటోలు వైరల్

  పెళ్లి ఫొటోలు వైరల్

  సైలెంట్ గా పెళ్లి చేసుకున్న విద్యుల్లేఖ ఇటీవల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది. అందులో ఆమె పెళ్లి కూతురిగా చాలా అందంగా కనిపించింది. భర్తతో నవ్వుతూ కనిపించింది. అంతే కాకుండా రిసెప్షన్ వేడుకను కూడా చాలా సింపుల్ గానే పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  English summary
  Vidyullekha Raman marriage photos viral in social media,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X