Nayanathara: పెళ్లయిన మరుసటి రోజే వివాదంలో నయనతార.. గుడిలో కనీస బాధ్యత లేకుండా...
స్టార్ హీరోయిన్ నయనతార యువ దర్శకుడు విగ్నేష్ శివన్ గురువారం రోజు హిందూ సాంప్రదాయ ప్రకారం మహాబలిపురంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరు పెళ్లి అనంతరం తిరుపతి తిరుమల దేవస్థానం లోకి అడుగుపెట్టి ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అయితే ఈ తరుణంలో నయనతార తిరుమల తిరుపతిలో ఒక వివాదంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధరణ జనాలు ఆమె తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెళ్లైన మరుసటిరోజే నయనతార ఈ విధంగా కొత్త వివాదంలో చర్చనీయాంశంగా మారింది. అసలు నయనతార ఏం చేసింది అనే వివరాల్లోకి వెళితే...

వైభవంగా పెళ్లి
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నయనతార యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గురువారం రోజు మహాబలిపురంలో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులు ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

పెళ్లికి ముందు
నయనతార స్టార్ హీరోయిన్ గా ఎంత క్రేజ్ అందుకున్నప్పటికి కూడా ఆమె నిత్యం భక్తి ఆరాధనలతో కూడా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ముఖ్యమైన సందర్భాల్లో ప్రత్యేకంగా పలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటుంది పెళ్లికి ముందే కొన్నిసార్లు కాబోయే భర్తతో ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన విషయం తెలిసిందే.

మొదట తిరుపతిలో..
నయనతారకు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ప్రత్యేకమైన ఇష్ట దైవం అని తెలుస్తోంది. ఆమె ఇది వరకే చాలాసార్లు తిరుపతికి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకున్నారు. అసలైతే నయనతార తన పెళ్లిని తిరుపతిలోని చేసుకోవాలని అనుకుంది. కానీ అనుకోని కారణాల వలన వర్కౌట్ కాకపోవడంతో చెన్నైలోని మహాబలిపురంలో ఆమె వివాహం చేసుకుంది.

శ్రీవారి దర్శనం
ఇక పెళ్లి జరిగిన మరుసటి రోజే నయనతార ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం లో అడుగు పెట్టింది. తన భర్తతో అలాగే మరికొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఆమె తో పాటు కొంతమంది సహాయకులు కూడా వచ్చారు. వీరిని చూసేందుకు అక్కడ జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. సెక్యూరిటీ వారిని కంట్రోల్ చేయడానికి కొద్దిసేపు చాలా ఇబ్బందులు పడింది.

వివాదంతో నయనతార
అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఎదుటనే విగ్నేష్ నయనతార ఫోటోషూట్ నిర్వహించారు. అయితే ఆలయ మాడవీధుల్లో ఎంత పవిత్రంగా భావించే స్థలంలో నయనతార చెప్పులు వేసుకుని కనిపించింది. అలాగే ఆమెతో వచ్చిన వాళ్లు కూడా అదే తరహాలో చెప్పులు వేసుకుని కనిపించడంతో ఒక్కసారిగా జనాలు తీవ్రంగా విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఆ విషయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. విగ్నేష్ శివన్ చెప్పులు వేసుకోకుండా ఉన్నప్పటికీ నయనతార అలా వేసుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని చెబుతున్నారు. మరి ఈ విషయంపై నయనతార ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











