Thalapathy Vijay- Trisha: సంగీత విడాకులు నోటీసు... త్రిషతో జంటగా విజయ్, నటితో రిలేషన్‌పై అలా హింట్?
కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్‌కి ఆయన సతీమణి సంగీత విజయ్ విడాకుల నోటీసు పంపిన వ్యవహారం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓ తమిళ సినీ నటితో విజయ్ అక్రమ సంబంధం పెట్టుకున్నారని.. దీనిపై నిలదీసినందుకు తనను వేధిస్తున్నాడని సంగీత తన విడాకుల పిటిషన్‌లో పేర్కొంది. దాంతో అందరి వేళ్లూ త్రిషపైనే చూపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి బంధం గురించి మీడియాలో గాసిప్స్‌కు తోడు.. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలకు సంగీత ఆరోపణలు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది.
అయితే నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష లీగల్‌గా స్పందించింది. తనకు సంబంధం లేదని మేటర్‌లోకి తనను లాగొద్దని వార్నింగ్ ఇచ్చింది. దాంతో త్రిషకు నాగేంద్రన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం సద్దుమణిగిన కొద్దిరోజులకే విజయ్ నుంచి విడాకులు కోరుతూ సంగీత చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కలకలం రేపింది. ఈ వివాదం నేపథ్యంలో తొలిసారి త్రిషతో విజయ్ జంటగా కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.

విజయ్ - త్రిషలు తమిళ చిత్ర పరిశ్రమలో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిద్దరూ కలిసి ఘిల్లీ, తిరుపాచ్చి, అథి, కురువి, లియో సినిమాలలో నటించారు. ది గోట్ చిత్రంలో స్పెషల్ రోల్‌లో త్రిష సందడి చేశారు. విజయ్‌తో ఉన్న అనుబంధంతోనే త్రిష గెస్ట్ రోల్‌కు ఒప్పుకున్నారని అప్పట్లో కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని గత కొంతకాలంగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తూనే ఉంది. నటి కీర్తి సురేష్ పెళ్లికి ఛార్టెర్డ్ ఫ్లైట్‌లో కలిసి వెళ్లడం, విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష స్పెషల్ విషెస్, లిఫ్ట్‌లో వీరిద్దరూ సెల్ఫీ దిగుతున్న ఫోటోలు అనేక అనుమానాలకు తావిచ్చాయి.
అలాగే సంగీత - విజయ్ విడిపోతారని కూడా ఎప్పటి నుంచో టాక్ వినిపించింది. కానీ ఎప్పటికప్పుడు అవి గాలి వార్తలుగానే నిలిచాయి. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో యాక్టీవ్ కావడంతో త్రిషతో రిలేషన్ అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యర్ధులు ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో సంగత తన భర్త నుంచి విడాకులు కోరడంతో దళపతి ఇబ్బందుల్లో పడ్డారు. ఆ వెంటనే కుమారుడు జాసన్ విజయ్ కూడా తండ్రిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం మరింత చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాలతో అందరి వేళ్లూ త్రిషవైపు చూపిస్తున్నాయి. దాంతో విజయ్ అభిమానులు రెచ్చిపోతున్నారు. తమ అభిమాన నటుడి జీవితాన్ని నాశనం చేసి, ఆయన కుటుంబాన్ని ముక్కలు చేస్తోందంటూ త్రిషపై వారు ట్రోలింగ్‌కు దిగుతున్నారు. దారుణమైన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంటా బయటా ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ విజయ్ కానీ, త్రిష కానీ ఈ ఆరోపణలను ఖండించలేదు. ఇద్దరూ మౌనంగానే ఉంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి దశలో విజయ్ - త్రిషలు సైలెంట్‌గా షాకిచ్చారు.
గురువారం చెన్నైలో జరిగిన ప్రముఖ నిర్మాత కళాపతి సురేష్- మీనాక్షి సురేష్ దంపతుల కుమారుడి పెళ్లికి త్రిష, విజయ్‌లు జంటగా హాజరయ్యారు. అనంతరం వధూవరులను వీరిద్దరూ ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తమిళ సినీ, రాజకీయ వర్గాలు షాక్ అయ్యాయి. తాజా ఘటనతో త్రిష- విజయ్‌లు తమ బంధాన్ని బహిర్గతం చేశారా? త్రిషతో బంధంపై విజయ్ హింట్ ఇచ్చారా? అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనిపై విజయ్ సతీమణి సంగీత ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











