Bichagadu 3: త్వరలో బిచ్చగాడు 3.. అలాంటి కథతో అప్పుడే మొదలు.. కన్ఫర్మ్ చేసిన హీరో!
విభిన్న జోనర్ లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోని. పేరుకు కోలీవుడ్ హీరో అయిన విజయ్ ఆంటోనికి తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన్ను ఇక్కడివారు గుర్తు పెట్టుకునేలా చేసిన సినిమా బిచ్చగాడు.
2014లో వచ్చిన ఈ సినిమాతో తెలుగుల వాడు అయిపోయాడు విజయ్. ఇటీవలే దానికి సీక్వెల్ గా బిచ్చగాడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాసులు పోగేసుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలోనే తాజాగా సూపర్ అప్డేట్ ఇచ్చాడు విజయ్ ఆంటోని.

దరువు సినిమాతో: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ మాస్ మహారాజా దరువు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన విజయ్ తర్వాత హీరోగా పలు చిన్న చిత్రాలు చేశాడు.

యమ పాపులర్: విజయ్ ఆంటోని నటించిన నకిలీ, డా. సలీమ్, డా. సలీమ్ 2 వంటి చిత్రాలు మంచి విజయం సాధింతాయి. అంతేకాకుండా అవి తెలుగులోనూ డబ్ అయి విజయ్ కు క్రేజ్ తీసుకొచ్చాయి. ఇక బిచ్చగాడు మూవీతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో యమ పాపులర్ అయ్యాడు ఈ హీరో.

తెలుగులోనే ఎక్కువ: ఇక ఇటీవలే బిచ్చగాడు 2 (తమిళంలో పిచైక్కారన్ 2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ హీరోతోపాటు దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా మే 19న విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికీ ఈ సినిమాకు రూ. తెలుగులో రూ. 10.85 గ్రాస్ కలెక్షన్స్ రాగా.. తమిళనాడులో రూ. 8.85 కోట్లు వసూళు చేసింది.

క్రేజీ అప్డేట్: బిచ్చగాడు 2 సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 10.40 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా.. రూ. 21.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలా సినిమాకు మంచి టాక్ తో కలెక్షన్ల పరంగా సత్తా చాటుతుంది. అయితే ఇలాంటి సమయంలో హీరో విజయ్ ఆంటోని అదిరిపోయే క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.
కొనసాగనున్న ఫ్రాంచైజీ: త్వరలోనే బిచ్చగాడు 3 సినిమాను తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు హీరో అండ్ డైరెక్టర్ విజయ్ ఆంటోని. ఈ బిచ్చగాడు ఫ్రాంచైజీని అలాగే కొనసాగిస్తున్నట్లుగా తాజాగా విజయ్ కన్ఫర్మ్ చేశాడట. బిచ్చగాడు 3 షూటింగ్ ను 2025లో మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు కూడా విజయ్ ఆంటోనియే దర్శకత్వం వహిస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

అలాంటి కథతో: బిచ్చగాడు 2 తరహాలోనే మరో ప్రయోగాత్మక కథాశంతో బిచ్చగాడు 3 తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో విజయ్ ఆంటోని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అలాగే బిచ్చగాడు సినిమాలను మెచ్చిన ప్రేక్షకులుకు కూడా ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే వార్త అని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











