twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    God Father: చిరంజీవి తండ్రిగా సీనియర్ విజయ్.. ముఖ్యమంత్రిగా కనిపించనున్న సీనియర్ స్టార్

    |

    సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ వస్తున్నారు సీనియర్ హీరో మెగస్టార్ చిరంజీవి. అయితే, గతంలో ఎన్నడూ చేయనంత వేగంగా ఇప్పుడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. అదే సమయంలో ఒకటి పట్టాలపై ఉండగానే.. మరో దాన్ని మొదలు పెడుతున్నారు. ఇలా ఈ మధ్య కాలంలోనే దాదాపు నాలుగైదు సినిమాలను ఓకే చేసేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. ఇది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    రాశీ ఖన్నాకు వింత అనుభవం: ఒంటరిగా ఎలా ఉంటున్నావ్.. నీ లవర్ పేరేంటి అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో!రాశీ ఖన్నాకు వింత అనుభవం: ఒంటరిగా ఎలా ఉంటున్నావ్.. నీ లవర్ పేరేంటి అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో!

    'ఆచార్య' షూటింగ్ జరుగుతోండగానే.. మెగాస్టార్ చిరంజీవి లైన్‌లో పెట్టుకున్న చిత్రాల్లో 'గాడ్ ఫాదర్' ఒకటి. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో.. మరో హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రం 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా చాలా రోజుల క్రితమే ప్రారంభం అయిపోయింది. ఆ వెంటనే షెడ్యూళ్ల మీద షెడ్యూళ్లను పూర్తి చేసుకుంటూ చిత్ర యూనిట్ దూసుకుపోతోంది.

    Vijay Chandar Key role in Chiranjeevis God Father Movie

    'లూసీఫర్' మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి తెలుగులో 'గాడ్ ఫాదర్' పేరిట తెరకెక్కిస్తున్నాడు మోహన్ రాజా. అందులో అసలు హీరోయిన్ పాత్రే ఉండదు. అయితే, చిరంజీవి చేసే సినిమాలో ఆ రోల్‌ను యాడ్ చేశారు. ఇక, ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ సమయంలోనే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడిచింది. కొద్ది రోజులకు ఆమె చేసేది చిరంజీవి చెల్లెలి పాత్ర అన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో అందరిలో అయోమయం నెలకొంది.

    Bigg Boss: ఆమెను హగ్ చేసుకుని ముద్దు పెట్టిన రవి.. మా ఆయన చూస్తాడు అంటూనే తను కూడా!Bigg Boss: ఆమెను హగ్ చేసుకుని ముద్దు పెట్టిన రవి.. మా ఆయన చూస్తాడు అంటూనే తను కూడా!

    'గాడ్ ఫాదర్' మూవీలో నటించేందుకు గానూ నటీనటుల ఎంపికపై చిరంజీవి పూర్తి స్థాయిలో దృష్టి సారించారట. ఇందులో భాగంగానే ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే తల్లి పాత్రకు గంగవ్వను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో ఎంతో ముఖ్యమైన హీరో తండ్రి పాత్రకు తాజాగా సీనియర్ నటుడు విజయ్ చందర్‌ను ఎంపిక చేసుకున్నారని ఓ న్యూస్ బయటకు వచ్చింది. హీరో తండ్రిగా ఉండే ఈ పాత్ర ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటుంది. ఈ పాత్రకు విజయ్ చందర్‌ను ఫైనల్ చేసుకున్నారని అంటున్నారు. దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని టాక్.

    పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యంతో సాగే 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందించబోతున్నాడు. సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

    English summary
    Star Hero Megastar Chiranjeevi doing God Father Under Mohan Raja Direction. Vijay Chandar to play Chiranjeevi Father Role in This Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X