Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: తూ.. దీనమ్మ జీవితం..ఫైనల్కు పోయిన ఆనందం కూడా లేదు!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్యాన్స్ కు సాడ్ న్యూస్ చెప్పిన విజయ్ దేవరకొండ.. పర్సనల్ ఫొటో రిలీజ్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ రానున్న రోజుల్లో పాన్ ఇండియా మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకోబోతున్నట్లు చాలా క్లారిటీగా అర్థమవుతోంది. లైగర్ సినిమా బజ్ అయితే మాములుగా లేదుగా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కూడా భారీ స్థాయిలో హైప్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే విజయ్ దేవరకొండ ఇటీవల తన పర్సనల్ ఫొటోను విడుదల చేసి సాడ్ న్యూస్ చెప్పాడు.

ఫ్యాన్స్ లో నమ్మకం..
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ నిర్మాతగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరపైకి రాబోతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు.

బాలీవుడ్ కూడా ఫ్యాన్ ఫాలోవర్స్
విజయ్ దేవరకొండకు కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండ తో నటించాలానే ఉన్నట్లు ఓపెన్ గానే తెలియజేశారు. అందులో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా ఉంది. అయితే విజయ్ దేవరకొండ సినిమా కోసం కేవలం అభిమానులు మాత్రమే కాకుండా చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు.

మరోసారి బ్రేక్..
హఠాత్తుగా లైగర్ సినిమా షూటింగ్ మరోసారి ఆగిపోయినట్లు విజయ్ దేవరకొండ అధికారికంగా తెలియజేశాడు. మొన్నటి వరకు శరవేగంగా కొనసాగిన ఈ సినిమా షెడ్యూల్ లో ప్రపంచం బాక్సింగ్ మైక్ టైసన్ కూడా నటించాడు. యూఎస్ నిర్వహించిన ఆ షెడ్యూల్ ఎంతో ఆసక్తిగా సాగింది అని దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కూడా తెలియజేశారు. మరొక చివరి షెడ్యూల్ తో బిజీగా ఉన్న సమయంలో ఆ సినిమాపై కరోనా ప్రభావం పడింది.

ఫొటో వైరల్..
ప్రస్తుత పరిస్థితిలో సినిమా షూటింగ్ ను కొనసాగించలేక చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ వచ్చేశారు. ఇక విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా తన పెంపుడు శునకం తో కూర్చుని చాలా సైలెంట్ గా ఉన్నట్లు కనిపించాడు. మరోసారి కరోనా వేవ్ తో షూటింగ్ క్యాన్సిల్ అయినట్లు చెబుతూ... మళ్ళీ ఇంట్లోనే చిల్ అవుతున్నట్లు పేర్కొన్నారు.

రిలీజ్ డేట్ ఫిక్స్
లైగర్ సినిమాలో విజయ్ ఒక బాక్సర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాకు సంబంధించిన అన్ని పనులను త్వరలోనే ఫినిష్ చేసుకొని ప్రమోషన్ డోస్ పెంచాలని చూస్తున్నారు. ఇక సడన్ గా కరోనా వలన షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. మరి మిగిలిన షూట్ ను ఎప్పుడు ఫినిష్ చేస్తారో చూడాలి.