Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇలాంటివి ఇంట్లో ట్రై చేయకండి.. కొరటాలకు ఛాలెంజ్‌కు విజయ్ రెస్పాన్స్.. ఇక మాలీవుడ్‌లో హంగామా
టాలీవుడ్లో ప్రస్తుతం వైరల్ అవుతోన్న ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. Be The Real Man అంటూ సాగుతున్న ఈ ఛాలెంజ్ శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా వేళ అందరూ ఇంటి పట్టునే ఉండటంతో మహిళలపై పని భారం పెరుగుతోంది. ఈ మేరకు మగవారంతా మహిళలకు ఇంటి పనుల్లో సాయం చేయాలని, నిజమైన మనిషి అనిపించుకోవాలని అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టాడు.
Recommended Video
ముందుకు తీసుకెళ్లిన దర్శకధీరుడు...
ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రాజమౌళి మీద పెట్టాడు సందీప్ రెడ్డి వంగా. ఈ మేరకు రాజమౌళి తన వంతుగా టాస్క్‌ను పూర్తి ఎన్టీఆర్, రామ్ చరణ్, సుకుమార్, కీరవాణి, శోభు యార్లగడ్డలకు తదుపరి ఛాలెంజ్‌ను విసిరాడు. ఈ మేరకు అందరూ తమ వంతుగా ఇంట్లో పనులు చేస్తూ ఉన్న వీడియోలు షేర్ చేశారు. ఇక రాజమౌళి నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎన్టీఆర్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జునలతో పాటు కొరటాల శివకు ఛాలెంజ్ విసిరాడు. ఈ మేరకు ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, కొరటాల శివ తమ బాధ్యతగా ఇంట్లో పనులు చేశారు. తదుపరి ఛాలెంజ్‌లను విసిరారు.
|
కొరటాల శివ నుంచి విజయ్‌కు..
కొరటాల శివకు ఎన్టీఆర్, సుకుమార్ ఇద్దరూ ఛాలెంజ్‌లు విసిరారు. అయితే ముందుగా జూనియర్ ఎన్టీఆరే ఛాలెంజ్ విసిరాడు. ఈ మేరకు ఆ సవాల్‌ను స్వీకరిస్తూ ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. మొదట్లో కష్టం అనిపించినా.. రాను రాను సరదాగా తయారైందని చెబుతూ తదుపరి ఛాలెంజ్‌ను విజయ్ దేవరకొండకు విసిరాడు.
|
ఇంకా పిల్లాడిగానే ట్రీట్ చేస్తున్నారు..
ఈ మేరకు స్పందించిన విజయ్ దేవరకొండ.. ‘శివ సర్.. మా మమ్మీ నన్ను పని చేయనివ్వట్లే.. పని డబుల్ అవుతోందట.. ఇంట్లో ఇంకా రియల్ మెన్లా చూడట్లే మమ్మల్ని.. పిల్లల్లానే ట్రీట్ చేస్తున్నారు.. కానీ లాక్ డౌన్లో ఎలా ఉంటున్నానో మీకు వీడియో చూపిస్తాను' అంటూ ట్వీట్ చేశాడు.
సగటు తొమ్మిదిన్నర గంటలు..
గతంలో కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోయే వాడినని లాక్ డౌన్ సగటున తొమ్మిదిన్నర గంటల పాటు నిద్ర పోతున్నానని తెలిపాడు. అంతేకాకుండా మిట్ట మధ్యాహ్నం లేచి తన పనులు చేసుకున్నట్టు చూపించాడు. ఇలాంటివి ఇంట్లో ట్రై చేయకండని ముందే చూపించాడు.
వాడేసిన మందు బాటిళ్లను..
లేచిన తరువాత ఫ్రెష్ అవ్వటం, ఇంటి పనులు చేయడం, తాగి వాడేసిన మందు బాటిళ్లలో వాటర్ నింపడం, పాత కవర్స్‌ను డస్ట్ బిన్ కవర్స్‌లా వాడాలని చూపించాడు. మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసి అమ్మ, తమ్ముడికి ఇచ్చాడు. వీడియో గేమ్స్ ఆడటం, తమ్ముడితో తల్లితో కలిసి ఇండోర్ గేమ్స్ ఆడటం లాంటి వాటితో విజయ్ లాక్ డౌన్ గడుస్తోందట. ఇక ఈ ఛాలెంజ్‌ను దుల్కర్ సల్మాన్‌కు విసిరి మాలీవుడ్లోకి పాకేలా చేశాడు.