ప్రియాంక రెడ్డి హత్య.. చిన్మయి స్పందన.. తగిన విధంగా శిక్ష.. విజయ్ దేవరకొండ కామెంట్స్
హైదరాబాద్ శివారులో జరిగిన ప్రియాంక రెడ్డి హత్య కలకలం సృష్టిస్తోంది. ఈ హత్య తాలూకు విషయాలు తెలిసి అన్నివైపుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రియాంక రెడ్డి హత్యపై పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు ఘాటుగా స్పందిస్తూ, ప్రియాంక కుటుంబానికి సంతాపం తెలిపారు. ఇప్పటికే కీర్తి సురేష్, అల్లరి నరేష్, సుధీర్ బాబు లాంటి వారు స్పందించారు. తాజాగా ప్రముఖ గాయని చిన్మయి, విజయ్ దేవరకొండ లాంటి వారు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బయటకు వెళ్లోద్దంటున్నారు..
రాత్రి 9 30 గంటల సమయంలో ప్రియాంక రెడ్డి హత్య జరగడంతో తమ ఇంట్లో వారు బయటకు వెళ్లనివ్వడం లేదని, తాను ప్రతీ రోజూ రాత్రి డ్యాన్స్ క్లాసులకు వెళ్తానని, అయితే రాత్రి వేళ అమ్మాయిలు బయట వెళ్లడం మంచిది కాదని, ఇంట్లోని ఉండమంటున్నారంటూ ఓ స్టోరీని రాసి సోషల్ మీడియాలో చిన్మయికు అందేలా పోస్ట్ చేసింది.
ఈ ఘటనతో ఇంట్లోనే ఉండమంటున్నారు..
ఎవరో పంపిన ఆ స్టోరీని పోస్ట్ చేస్తూ.. ప్రియాంక రెడ్డి హత్య జరిగిన తరువాత తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంట్లోనే ఉంచాలని అనుకుంటున్నారని, వారి అలవాట్లను, క్లాస్‌లకు వెళ్లొద్దని అంటున్నారు.. అలా ఉండే రేప్‌కు గురి కాకుండా ఉంటారని అనుకుంటున్నట్లు పోస్ట్ చేసింది. అమ్మాయిలకు చెప్పినట్టుగా ఏ పేరెంట్స్ కూడా అబ్బాయిలకు చెప్పరని, అమ్మాయిల ఫోన్‌లను చెక్ చేసే తల్లిదండ్రులు అబ్బాయిలవి పరీక్షించరంటూ చెప్పుకొచ్చింది.

తగిన విధంగా శిక్షించండి..
ఈ దుర్ఘటనపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇంటికి సంబంధించిన రక్షణ అబ్బాయిలు చూడాలని చెడు ప్రవర్తన ఎక్కడున్నా సహించకూడదని, వాటిని సరిచేయాలని, వారికి అర్థమయ్యేలా చెప్పాలని అన్నాడు. అంతటి నీచానికి పాల్పడిన వారికి హక్కులనేవీ ఉండవని, వారిని తగిన విధంగా శిక్షించాలి. ఆపద సమయంలో పోలీసులకు ఫోన్ చేయండి అంటూ సూచించాడు.
Recommended Video

నిరసనలతో అట్టుడుకుతోంది..
ప్రియాంక రెడ్డి హత్య ఘటనతో రాష్ట్రం అంతా అట్టుడుకుతోంది. మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు, డాక్టర్ల సంఘాలు ఇలా అందరూ రోడ్ల పైకి వచ్చారు. ఈ ఘటనకు సంబంధమున్న ప్రతీ ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











