India vs Pakistan: మ్యాచ్ లో విజయ్ దేవరకొండ.. ఇండియాకు మద్దతు ఇస్తూ లైగర్ డైలాగ్
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత విజయ్ ప్రమోషన్స్ అయితే భారీ స్థాయిలోనే చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా దేశం అంతా ఎదురుచూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా విజయ్ హైలెట్ అవడం వైరల్ గా మారింది. ఇండియాకు మద్దతు ఇస్తూ విజయ్ దేవరకొండ మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..

బెస్ట్ ఒపెనింగ్స్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా ఇటీవల ఫ్యాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు విభిన్నమైన టాక్ వచ్చినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఎప్పుడు లేని విధంగా సరికొత్త ఫిట్నెస్ తో విజయ్ చాలా పవర్ ఫుల్ గా కనిపించడం అందరికీ ఆసక్తిని కలిగించింది. ఇక ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది.

క్రికెట్ మ్యాచ్ లో విజయ్
ఇక లైగర్ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా విజయ్ ప్రమోషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. సినిమా తప్పకుండా మంచి ప్రాఫిట్ లోకి రావాలి అని తనదైన శైలిలో భారీ స్థాయిలోనే ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఆసియా కప్ మ్యాచ్లో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో కూడా కనిపించడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇండియా గెలవాలి అంటూ..
గత కొన్నేళ్లుగా ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది క్రికెట్ లవర్స్ కూడా ఇండియా vs పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇదే మ్యాచ్లో విజయ్ దేవరకొండ కనిపించడం కూడా హైలెట్ గా మారింది. అంతేకాకుండా విజయ్ లైగర్ డైలాగ్ తో కూడా కెమెరా ముందు కనిపించడం విశేషం. ఇండియా తప్పకుండా గెలవాలి అని కూడా తన మద్దతును ఇచ్చాడు.

ఫొటోలు వైరల్
ఇక విజయ్ దేవరకొండ క్రికెట్ ను వీక్షిస్తూ ఇండియాకు సపోర్ట్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దుబాయ్ లో జరుగుతున్న ఈ క్రికెట్ మ్యాచ్ కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా వెళ్ళాడు అంటే అతని రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని కూడా సోషల్ మీడియాలో రౌడీ అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక ఫోటోలు కూడా వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్..
ఇక మొదటి రోజు హిందీలో అయితే లైగర్ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ఈ ఆదివారం కూడా కలెక్షన్స్ మరింత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా విజయ్ దేవరకొండ సరికొత్త ప్రయోగంతో లైగర్ ద్వారా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టాడు అని పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక ఈ సినిమా అనంతరం విజయ్ ఖుషి సినిమా ద్వారా బిజీ కాబోతున్నాడు. ఆ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











