తమిళ హీరో సినిమా కోసం రాబోతున్న విజయ్ దేవరకొండ.. గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ రెడీ!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్తవారికి సపోర్ట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న స్థాయి నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫ్యాన్ ఇండియా హీరోగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే పక్క ఇండస్ట్రీలో నుంచి వస్తున్న హీరోలకు కూడా విజయ్ దేవరకొండ అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. తెలుగులో అన్ని సినిమాలు బాగా ఆడాలి అనే ఆలోచనతోనే ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇక ఒక తమిళ హీరో కోసం ఇప్పుడు విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు.
విజయ్ దేవరకొండ ఏ హీరో కోసం రాబోతున్నాడు అనే వివరాల్లోకి వెళితే.. తమిళంలో ఇటీవల కాలంలో వరుసగా బాక్సాఫీస్ విజయాలను అందుకుంటున్న శివకార్తికేయన్ మొదటిసారి ప్రిన్స్ అనే ద్విభాష చిత్రం ద్వారా తెలుగు మార్కెట్లోకి డైరెక్ట్ గా అడుగుపెట్టబోతున్నాడు. ఏషియన్ సినిమాస్ సురేష్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఏవేబై అక్టోబర్ 18వ తేదీన గ్రాండ్గా నిర్వహించబోతున్నారు.

ప్రిన్స్ సినిమాను అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. లైగర్ సినిమా తర్వాత ఏ సినిమా ఈవెంట్లో కనిపించని విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్రిన్స్ సినిమా కోసం రాబోతూ ఉండడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై ఫోకస్ పడింది.
తెలుగువారి సపోర్ట్ కోసం శివకార్తికేయన్ ప్రమోషన్స్ కూడా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇదివరకే జాతి రత్నాలు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అనుదీప్ ఈ సినిమాతో కూడా సక్సెస్ దక్కించుకోవాలి అని అనుకుంటున్నాడు. ఈ సినిమా డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











