సెట్‌లోకి వెళ్లేముందు అలా ఎంజాయ్.. విజయ్ దేవరకొండ వీడియో వైరల్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమా అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఫస్ట్ లుక్, పోస్టర్‌లతో విజయ్ చేసిన హంగామా ఇప్పటికే హాట్ టాపిక్ అవుతూనే ఉంది. విజయ్ ప్రస్తుతం లైగర్ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు. అయితే సెట్‌లో అడుగుపెట్టే ముందు విజయ్ దేవరకొండ తన పెట్‌లతో రచ్చ చేశాడు.
మామూలుగా విజయ్ దేవరకొండ తన పెంపుడు కుక్కలతో రచ్చ చేస్తుంటాడు. స్ట్రామ్ అంటూ తన పెట్‌ను ముద్దు చేస్తుంటాడు. అలా విజయ్ దేవరకొండ తన పెంపుడు కుక్కలతో చేసే అల్లరి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సెట్‌లోకి వచ్చే కొన్ని రోజుల ముందు స్ట్రామ్‌తో ఇలా ఆడుకున్నాను అంటూ విజయ్ ఓ వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో తెగ వైరల్ అవుతోంది.

విజయ్ లైగర్ సినిమా బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక లైగర్ సినిమా కోసం మొత్తం రూ.110కోట్ల వరకు ఖర్చు చేయనున్నారట. కేవలం ఇది ఒక అంచనా మాత్రమేనని తెలుస్తోంది. అవసరం అయితే మరికొంత పెరిగే ఛాన్స్ ఉందట. మొత్తానికి ప్యాన్ ఇండియన్ సినిమా రేంజ్‌కు తగ్గట్టుగానే విజయ్ పూరి జగన్నాథ్ తమ ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నారు. మొత్తానికి ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది.


Click it and Unblock the Notifications











