Liger: అసలైన ఫన్ మొదలు కాబోతోంది.. విజయ్ దేవరకొండ భారీ ప్లాన్
త్వరలోనే లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే ఏకంగా ఈసారి విజయ్ తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా పాన్ ఇండియా ప్రపంచంలో ఆ రూట్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
ఇప్పటికే షూటింగ్ పనులు అన్ని కూడా ముగిసిపోయాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా రాబోయే రెండు నెలల్లో సినిమాపై మరింత హైప్ పెంచే విధంగా భారీ స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరంలో ప్రమోషన్ చేసే విధంగా కూడా రెడీ అవుతున్నారట. ఏమాత్రం గ్యాప్ లేకుండా మరో 10 రోజుల్లోనే రెగ్యులర్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలి అనే డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సినిమాపై మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు సినిమాలో జనాల్లోకి తీసుకు వెళ్లే విధంగా విజయ్ దేవరకొండ దేశంలో ఉన్న ప్రధాన నగరాలను చుట్టేయబోతున్నట్లు సమాచారం.
ఆడియోన్స్ తో కూడా ప్రత్యేకంగా స్పెషల్ మీట్స్ ఏర్పాటు చేసి వారితోనే సినిమాకు హైప్ క్రియేట్ చేసే విధంగా డిసైడ్ అయ్యారట. అంటే విజయ్ దేవరకొండ అభిమానులతో ప్రత్యేకంగా లైగర్ సినిమా ముచ్చట్లను షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ తో సినిమా జనాలకు ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి. లైగర్ సినిమాను ఆగస్టు 25వ తేదీన ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమన అనే మరో కొత్త ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











