బహుమతిగా ఖరీదైన వస్తువు.. సర్‌ప్రైజ్ చేసిన దేవరకొండ బ్రదర్స్
విజయ్ దేవరకొండ ఏ పని చేసినా సెన్సేషన్‌గానే మారుతూ ఉంటుంది. సినిమాల్లో కనిపించినా, బయట వేడుకల్లో కనిపించినా, మాట్లాడినా ఇలా ఏదో రకంగా విజయ్ దేవరకొండ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. మిగతా హీరోల కంటే భిన్నంగా వ్యవహరించడం, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లడం, జనాల్లో క్రేజ్‌ను పెంచుకునేందుకు కొత్త ఐడియాలను ఉపయోగించడం ఇలా ప్రతీ దాంట్లో విజయ్ మార్క్ కనిపిస్తుంది.

బర్త్ డే రోజు హంగామా..
విజయ్ దేవరకొండ తన పుట్టిన రోజు వేడుకలను రోడ్డు మీదే.. సామాన్య జనాలతో కలిసి చేసుకుంటాడు. అంతకుముందు ఏడాది అందరికీ ఐస్‌క్రీమ్స్ సప్లయ్ చేశాడు. గతేడాది పలు నగరాల్లో విజయ్ దేవరకొండ పేరు మీద కొన్ని వాహనాలు కూడా ఏర్పాటు చేసి అందరికీ ఐస్‌క్రీమ్స్ పంచేలా చేశాడు. ఇలా కొత్త రకంగా ఆలోచించి అందరి దృష్టిలోనూ పడ్డాడు విజయ్.

సోషల్ మీడియాలోనూ యాక్టివ్..
సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఉన్నంత యాక్టివ్‌గా మరే తెలుగు హీరో ఉండడేమో అనిపిస్తుంది. తనపై నెగెటివ్ కామెంట్స్‌ను సైతం తీసుకుంటూ.. స్పోర్టీవ్‌గా ఉంటాడు. సోషల్ మీడియాలో అతనిపై వచ్చే మీమ్స్, ట్రోల్స్‌ను కూడా లైట్ తీసుకుంటాడు. ఇలా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాడు.
క్రిస్మస్ హంగామా..
2018 క్రిస్మస్ వేడుకల్లో కొన్ని బహుమతులను సాధారణ జనాల్లో తిరుగుతూ అక్కడి వారికే ఇచ్చాడు. ఇలా సాంటా గిఫ్ట్స్‌ను ఇవ్వడం విజయ్‌కు అలవాటే. అయితే ఈ సారి కూడా అలాంటి ఆలోచనే చేశాడు. ఎవరికి ఏది కావాలో చెప్పండి.. #Deverasanta2019 అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయండి.. ఇస్తానని చెప్పుకొచ్చాడు.

ఖరీదైన ల్యాప్ ట్యాప్..
యాపిల్ కంపెనీకి చెందిన ఖరీదైన ల్యాప్‌ట్యాప్‌ను అడిగిన వ్యక్తి.. దేవరసాంటాలు బహుకరించారు. ఆనంద్ దేవరకొండ స్వయంగా అతని ఇంటికి వెళ్లి ఆ బహుమతిని ఇవ్వడంతో ఆశ్చర్య పోవడం అతని వంతైంది. ఈ గిఫ్ట్‌ను ఇచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బైపోయిన సదరు వ్యక్తి.. తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా స్పందింస్తూ ఆనందానికి అవధుల్లేవని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











