ఇంకా పిల్లాడిగానే ట్రీట్ చేస్తున్నారు.. పనులు చేయనివ్వడం లేదు.. విజయ్ దేవరకొండ ఆవేదన

టాలీవుడ్‌లో ప్రస్తుతం వైరల్ అవుతోన్న ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వేళ అందరూ ఇంటి పట్టునే ఉండటంతో మహిళలపై పని భారం పెరుగుతోంది. ఈ మేరకు మగవారంతా మహిళలకు ఇంటి పనుల్లో సాయం చేయాలని, నిజమైన మనిషి అనిపించుకోవాలని అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ ఛాలెంజ్‌ను మొదలుపెట్టాడు. ఈ ఛాలెంజ్ అలా అలా ముందుకు కొనసాగుతూ.. స్టార్ హీరోలందర్నీ టచ్ చేసింది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను తాను చేయలేకపోతోన్నానని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

ముందుకు తీసుకెళ్లిన దర్శకధీరుడు...

ముందుకు తీసుకెళ్లిన దర్శకధీరుడు...

ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రాజమౌళి మీద పెట్టాడు సందీప్ రెడ్డి వంగా. ఈ మేరకు రాజమౌళి తన వంతుగా టాస్క్‌ను పూర్తి ఎన్టీఆర్, రామ్ చరణ్, సుకుమార్, కీరవాణి, శోభు యార్లగడ్డలకు తదుపరి ఛాలెంజ్‌ను విసిరాడు. ఈ మేరకు అందరూ తమ వంతుగా ఇంట్లో పనులు చేస్తూ ఉన్న వీడియోలు షేర్ చేశారు.

ఎన్టీఆర్ నుంచి అలా..

ఎన్టీఆర్ నుంచి అలా..

ఇక రాజమౌళి నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎన్టీఆర్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జునలతో పాటు కొరటాల శివకు ఛాలెంజ్ విసిరాడు. ఈ మేరకు ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, కొరటాల శివ తమ బాధ్యతగా ఇంట్లో పనులు చేశారు. తదుపరి ఛాలెంజ్‌లను విసిరారు.

కొరటాల శివ నుంచి విజయ్‌కు..

కొరటాల శివకు ఎన్టీఆర్, సుకుమార్ ఇద్దరూ ఛాలెంజ్‌లు విసిరారు. అయితే ముందుగా జూనియర్ ఎన్టీఆరే ఛాలెంజ్ విసిరాడు. ఈ మేరకు ఆ సవాల్‌ను స్వీకరిస్తూ ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. మొదట్లో కష్టం అనిపించినా.. రాను రాను సరదాగా తయారైందని చెబుతూ తదుపరి ఛాలెంజ్‌ను విజయ్ దేవరకొండకు విసిరాడు.

Recommended Video

#BeTheRealMan: Sampoornesh Babu's Video Goes Viral
 ఇంకా పిల్లాడిగానే ట్రీట్ చేస్తున్నారు..

ఇంకా పిల్లాడిగానే ట్రీట్ చేస్తున్నారు..

ఈ మేరకు స్పందించిన విజయ్ దేవరకొండ.. ‘శివ సర్.. మా మమ్మీ నన్ను పని చేయనివ్వట్లే.. పని డబుల్ అవుతోందట.. ఇంట్లో ఇంకా రియల్ మెన్‌లా చూడట్లే మమ్మల్ని.. పిల్లల్లానే ట్రీట్ చేస్తున్నారు.. కానీ లాక్ డౌన్‌లో ఎలా ఉంటున్నానో మీకు వీడియో చూపిస్తాను' అంటూ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X