JGM: ఇండియా తలచుకుంటే ప్రపంచాన్ని రూల్ చేయవచ్చు.. విజయ్ దేవరకొండ జనగణమన మొదలైంది..

తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో హీరో క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ లైగర్ సినిమా విడుదలకు సిద్ధం చేసి ఉంచిన పూరి ఆ వెంటనే విజయ్ తోనే మరో సినిమాను స్టార్ట్ చేస్తుండడం విశేషం. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి జనగణమన అనే స్టోరీని ఇదివరకే కొంతమంది హీరోలతో చేయాలని అనుకున్న పూరి జగన్నాథ్ ఫైనల్ గా విజయ్ దేవరకొండ తో చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక నేడు సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Puri Jagannath పంతం నెగ్గిచుకున్నాడు.. Vijay Devarakonda తో JGM | Filmibeat Telugu
లైగర్ రెడీ..

లైగర్ రెడీ..

దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లైగర్ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు మొత్తం కూడా పూర్తయ్యాయి. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అయితే ఆ పనులు పూర్తి చేయడానికి కూడా ఎంతో సమయం పట్టదు. ఇక ఈ ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

న్యూ ప్రాజెక్ట్.. జనగణమన

న్యూ ప్రాజెక్ట్.. జనగణమన

అయితే ఇంకా లైగర్ సినిమా విడుదల కాలేదు. అప్పుడే దర్శకుడు పూరి జగన్నాధ్ మరో సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. విజయ్ దేవరకొండతో జనగణమన అనే ప్రాజెక్టును చేయబోతున్నట్లు ముందు నుంచి సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక నేడు ప్రాజెక్టును అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది.

విజయ్ దేవరకొండ పవర్ఫుల్ ఎంట్రీ

విజయ్ దేవరకొండ పవర్ఫుల్ ఎంట్రీ

జనగణమన సినిమాలో విజయ్ దేవరకొండ ఒక పవర్ఫుల్ ఇండియన్ సోల్జర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ముంబైలో ఈ సినిమాను లాంచ్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని కూడా షూట్ చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ ఒక హెలికాప్టర్ నుంచి సైనికుడిగా వస్తూ ఉండడం ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా మిగతా సైనికులకు కూడా అతను సెల్యూట్ చేసిన విధానం కొత్తగా అనిపించింది.

పవర్ఫుల్ డైలాగ్

పవర్ఫుల్ డైలాగ్

విజయ్ దేవరకొండ కూడా ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు చేయలేదు కాబట్టి సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇప్పటివరకు భారత దేశాన్ని ఎంతో మంది పరిపాలించారు అంటూ.. ఇండియన్ టైగర్స్, ఇండియన్ ఫైటర్స్ అంటూ ఇండియా తలచుకుంటే ప్రపంచాన్ని రూల్ చేయవచ్చు అని విజయ్ చెప్పిన హై వోల్టేజ్ డైలాగ్ ఎంత పవర్ గా ఫుల్ గా ఉంది.

దాడిలో బలం ఉంది, రక్షణలో లేదు

దాడిలో బలం ఉంది, రక్షణలో లేదు

డచ్ ,ఫ్రెంఛ్ , బ్రిటిష్ .. ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా ? ఆ పని మనమెందుకు చేయడం లేదు ? ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని మిగతా దేశాలు భయపడుతూ చావాలి.. దాడిలో బలం ఉంది, రక్షణలో లేదు.. అంటూ ఇదివరకే దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ ను సోషల్ మీడియా ద్వారా కూడా షేర్ చేసుకోవడం జరిగింది. చూస్తుంటే భారత సైనికుల ఎదురు దాడులకు ఈ సినిమాలో బలంగా చూపుతున్నట్లు అర్థమవుతోంది.

రిలీజ్ డేట్ ఫిక్స్

రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ఫినిష్ చేయనున్న చిత్ర యూనిట్ సభ్యులు వీలైనంత త్వరగా అన్ని పనుల షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టులో సినిమాఙ్ విడుదల చేయాలని అనుకుంటున్నారు. అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకు సాగితే 2023 ఆగష్టు 3వ తేదీన సినిమాను విడుదల చేయాలి అని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X