Liger రన్ టైమ్ ఫిక్స్.. రౌడీ స్టార్ ను పర్ఫెక్ట్ ప్లాన్ తో రెడీ చేసిన పూరి జగన్నాథ్.. హిట్ సెంటిమెంట్

డేరింగ్ అండ్ యాక్షన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే ట్రైలర్ సాంగ్స్ సినిమాపై అంచనాల స్థాయిని పెంచేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ పక్కా ప్రణాళికతో రన్ టైం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మరొక లెక్క..

మరొక లెక్క..

దర్శకుడు పూరి జగన్నాథ్ ఏ హీరోతో సినిమా చేసిన కూడా చాలా పవర్ ఫుల్ గా ఆ హీరోను చూపిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మొదటిసారి విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు అనగానే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా అంచనాల ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటివరకు చూసిన విజయ్ దేవరకొండ ఒక లెక్క.. లైగర్ తర్వాత కనిపించబోయే విజయ్ దేవరకొండ మరొక లెక్క అనే విధంగా సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ లోనే భారీగా..

బాలీవుడ్ లోనే భారీగా..

లైగర్ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఎలాగు విజయకు మంచి క్రేక్ ఉంది కాబట్టి బాలీవుడ్ లోనే ఇటీవల ఎక్కువగా ప్రమోషన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాను అక్కడ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ స్థాయిలోనే విడుదల చేయడం జరుగుతుంది. అనన్య పాండే ఈ సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్గా కనిపించబోతోంది.

హార్డ్ వర్క్ చేసిన విజయ్

హార్డ్ వర్క్ చేసిన విజయ్

తప్పకుండా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కోసం అతను చాలా హార్డ్ వర్క్ చేసాడు. అంతేకాకుండా ఫిట్నెస్ లో కూడా ఎన్నో మార్పులు చేశాడు. బాక్సింగ్ కోసం కూడా ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఉండే యాక్షన్ ఎలిమెంట్స్ లో విజయ్ దేవరకొండ ఎలాంటి డుబ్ లేకుండా నటించాడట.

రన్ టైమ్ ఫిక్స్

రన్ టైమ్ ఫిక్స్

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ స్టైల్ కు తగ్గట్టుగానే కనిపించబోతున్నట్లు పోస్టర్లు తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా డైలాగ్స్ కూడా మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైం కూడా ఇటీవల ఫిక్స్ చేశారు. రేపో మాపో సెన్సార్ కు సంబంధించిన పనులు కూడా ముగియన్నాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా నిడివి రెండు గంటల 20 నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

సెంటిమెంట్..

సెంటిమెంట్..

అయితే ఇంతకుముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు కూడా రెండు గంటల 20 నిమిషాల్లో ఉంటే మాత్రం అది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇది సెంటిమెంట్ అనుకోని సెట్ చేసుకున్నారో లేక అంతే నిడివి అనుకోని ఫిక్స్ చేసుకున్నారో తెలియదు గాని ఇంతకుముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా దాదాపు ఇదే రన్ టైం తో విడుదల అయింది. మరి లైగర్ సినిమా ఈసారి ప్రేక్షకులకు ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X