Liger: వేటకు సిద్దమవుతున్న విజయ్ దేవరకొండ.. ఆ రోజు అసలైన ర్యాంపేజ్!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విజయ్ దేవరకొండ తదుపరి సినిమాతో మాత్రం నేషనల్ లెవల్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకునేలా కనిపిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియా లో సరికొత్తగా ట్రెండ్ సెట్ చేసింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ నుంచి కూడా భారీ స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. అసలైతే ఈ సినిమా షూటింగ్ ను ఇదివరకే పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అసలైన ప్రమోషన్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. కరోనా వలన కూడా షూటింగ్ కు బ్రేకులు వేసిన విషయం తెలిసిందే.

Vijay devarakonda liger movie Rampage update

లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక పవర్ఫుల్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ త్వరలోనే రాబోతోంది. ఈనెల 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు అసలైన రాంపేజ్ మొదలవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆరోజు ఎలాంటి ఇస్తారు అనేది దేవరకొండ అభిమానుల్లో ఆసక్తిని నెలకొల్పింది. ఈ సినిమాకు సంబంధించిన మరొక టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫస్ట్ హాఫ్ లో ఒక నేషనల్ బాక్సర్ గా ఆ తర్వాత ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపించే కనిపించబోతున్నట్లు టాక్ అయితే వస్తోంది. తప్పకుండా అతని పాత్ర వెండితెరపై హై వోల్టేజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది అని పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక లైగర్ సినిమాను పూరి జగన్నాథ్ అలాగే కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సీనియర్ హీరోయిన్ చార్మి కూడా మరొక పార్ట్నర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు అన్నిటిని కూడా ఇదివరకే పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విజయ్ తో మరో కొత్త ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాను కూడా పాన్ ఇండియాకు తగ్గట్టుగానే తెరపైకి తీసుకు రాబోతున్నాడు. లైగర్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25 వ తేదీన విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X