2025లో విజయ్ దేవరకొండ పెళ్లి? తన పోస్ట్ .. ఏదో తేడాగా ఉందే..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు యంగ్ జెనరేషన్‌ని ఉర్రూతలు ఊగించే హీరోలు వస్తూనే ఉంటారు. అలా ఇపుడు ఉన్న జెనరేషన్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న యువ హీరో ఎవరు అంటే అది ఖచ్చితంగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పొచ్చు. మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.
అప్పటికే పలు సినిమాలు చేసాడు కానీ అర్జున్ రెడ్డి ఇచ్చిన బ్రేక్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత దానికి మించిన హిట్‌ని దర్శకుడు పరశురాం పెట్లతో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా గీతా గోవిందంతో అందుకున్నాడు. ఇక్కడి నుంచి ఆ సినిమా హీరోయిన్ రష్మికతో డియర్ కామ్రేడ్ కూడా చేసాడు. కాగా ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై పలు రూమర్స్ మొదలయ్యాయి.

ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, రిలేషన్ లో కూడా ఉన్నారని పలు పుకార్లు వినిపించిన మాట వాస్తవం. అది అలా ఇన్నేళ్లుగా కొనసాగుతూ వచ్చింది. ఫైనల్ గా ఇపుడు దాదాపు ఇద్దరూ ఓపెన్ కూడా అయ్యిపోయారు. సోషల్ మీడియాలో ఇద్దరూ సెపరేట్‌గా ఫొటోస్ షేర్ చేసుకున్నప్పటికీ ఇద్దరూ ఒకే దగ్గర ఉండడం కొసమెరుపు. ఇక రీసెంట్ గా పుష్ప 2 ఈవెంట్ లో కూడా తన రిలేషన్ షిప్ పై రష్మిక ఓపెన్ గా ఎవరో మీకు కూడా తెలుసు అంటూ స్టేట్మెంట్ ఇచ్చి కుండబద్ధలు కొట్టింది.
చాలా వరకు ఇద్దరిపై పలు కామెంట్స్ కొనసాగుతూనే ఉండగా ఇపుడు విజయ్ దేవరకొండ పెళ్లిపై ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం ఫ్యాన్స్ లో కుతూహలం రేపింది. వయసుకొచ్చిన కొడుకో కూతురో ఉంటే డెఫినెట్ గా పెళ్లి ప్రస్తావన తరచూ వస్తూ ఉంటుంది. మరి ఎప్పుడూ సోషల్ మీడియాలో సింపుల్, తన యాటిట్యూడ్ లేదా బ్రాండ్స్ పై స్టోరీస్ పెట్టుకునే విజయ్ లేటెస్ట్ గా తన పెళ్లిపై పెట్టిన పోస్ట్ ఆసక్తి రేపింది.

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌పై రీసెంట్‌గా ట్రెండ్ అయ్యిన ఓ వీడియో మీమ్ తో తన పెళ్లిపై స్పందించాడు. అందులో ఈ 2025లో అయినా పెళ్లి చేసుకుంటావా అంటే దానికి తన రియాక్షన్ గా రజినీకాంత్ ఏమీ చెప్పలేని విధంగా ఎక్స్ ప్రెషన్స్ పలికించే వీడియోని తన పెళ్లిపై పోస్ట్ చేసాడు విజయ్. అంటే ఈ 2025లో కూడా పెళ్లి విషయంలో ఓ క్లారిటీతో తాను లేడా అనిపిస్తుంది.
అలాగే తన పెళ్లి విషయంలో కుటుంబం కూడా ప్రెజర్ పెడుతున్నట్టే ఈ పోస్ట్ తో తన హావభావాలని తాను చూపించాడని చెప్పాలి. ఇలా మొత్తానికి అయితే పెళ్లి విషయంలో విజయ్ దేవరకొండ పరిస్థితి ఏదో తేడాగానే ఉందని అనుకోవచ్చు. ఇక అభిమానులు కూడా తమ హీరో రష్మిక పేరుని అఫీషియల్ గా అనౌన్స్ చేసేసి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











