Family Star: ఫ్యామిలీ స్టార్ సెన్సార్ రివ్యూ - కట్ చేసిన బూతులు ఇవే!

మరో రెండు రోజుల్లో రౌడీ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్​ థియేటర్లలో అడుగు పెట్టనుంది. అంటే ఏప్రిల్ 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ నటించడంతో పాటు గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించడం, మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా చేయడం, నిర్మాతగా దిల్​ రాజు వ్యవహరించడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

తాజాగా ఈ సినిమా సెన్సార్​ పనులను పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రంలో కొన్ని పచ్చి బూతులు ఉన్నాయని వాటిని సెన్సార్ సభ్యులు కట్​ చేశారు. ఇంతకీ అవేంటి? సినిమా రన్ టైమ్ ఎంత? ఏం సర్టిఫికేట్ ఇచ్చారు? వంటి విషయాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

Vijay Devarakonda Mrunal Thakur Family Star Movie Censor Review

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన చివరిగా హీరోయిన్ సమంతతో కలిసి నటించిన ఖుషి చిత్రం టాక్ పరంగా పర్వాలేదనిపించినా బాక్సాఫీస్ వద్ద అంతగా వసూళ్లను సాధించలేకపోయింది. ఏదేమైనా ఆ చిత్రం హిట్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆయన తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రంపై యూత్​తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్​లో మంచి అంచనాలే ఉన్నాయి. దీని చూసేందుకు చాలా మందే ఆసక్తిగా ఉన్నారు.

అందుకు తగ్గట్టే మూవీ టీమ్​ కూడా ప్రమోషన్స్​ను బాగానే నిర్వహిస్తోంది. వరుసగా ఇంటర్వ్యూలూ, ఫొటోషూట్స్​ కూడా చేయిస్తోంది. ఏప్రిల్ 5, 2024న థియేటర్లలోకి సినిమా రానుంది. గీతా గోవిందం ఫేమ్​ పరశురామ్ పెట్ల దీనికి దర్శకత్వం వహించారు. గతంలో పరశురామ్​ - విజయ్ కాంబోలో వచ్చిన గీతా గోవిందం బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యామిలీ స్టార్​పై మంచిగా అంచనాలు ఉన్నాయి.

ఇంకా ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా నటిస్తోంది. రష్మిక మందన్న గెస్ట్​ రోల్​లో సందడి చేయనుంది. దిల్​ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ దక్కించుకుంది. సినిమా రన్​ టైమ్​ 163 నిమిషాలు ఉంది. అంటే 2 గంటల 43 నిమిషాల నిడివితో ఫైనల్ వెర్షన్ లాక్ చేశారన్నమాట.

Vijay Devarakonda Mrunal Thakur Family Star Movie Censor Review

అలాగే సినిమాలోని ఐదు అసభ్యకరమైన పదాలను మ్యూట్ చేయాలని మూవీటీమ్​కు సెన్సార్ అధికారులు సూచించారని తెలిసింది. ఎందుకంటే అందులో పచ్చి బూతులు ఉన్నాయి. అందుకే వాటిని అభ్యంతరం తెలిపారు. లిక్కర్ లేబుల్స్ మీద కూడా అభ్యంతరం చెప్పారు. అయినా మొదటి నుంచి ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమంటూ నిర్మాత దిల్ రాజు సహా మూవీటీమ్ చెప్పుకుంటూ

వచ్చింది. కానీ ఇప్పుడేమో అందులో అలాంటి పదాలు ఉంచింది. స్క్రిప్ట్ డిమాండ్ చేసిందని మూవీటీమ్​ చెప్పుకొచ్చినా అలాంటి పదాలను ఫ్యామిలీ అండ్ లేడీ ఆడియెన్స్​ కచ్చితంగా వినలేరు. కాబట్టి అందుకే వాటిని మ్యూచ్ కచ్చితంగా చేయొచ్చు.

ఇకపోతే ప్రస్తుతం బాక్సాఫీస్ ముందు టిల్లు స్క్వేర్ మోత మోగిస్తున్నాడు. విడుదలైన ఐదు రోజుల్లో రూ.80కోట్ల వరకు వసూలు చేశాడు. ఇంకా ఆ సినిమా సక్సెస్​ఫుల్​గానే రన్ అవుతోంది. మరి ఫ్యామిలీ స్టార్ వచ్చి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో. సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటే ఓకే. లేదంటే అందరి చూపు టిల్లు స్క్వేర్ మీదే ఉంటుంది. ఫ్యామిలీ స్టార్​ డౌన్ అయిపోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కాగా, ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X