Family Star Trailer Review కొత్తగా బ్రేక్ ఇవ్వాల్సిందేమి లేదు.. ఫ్యామిలీ స్టార్ నెక్ట్స్ లెవెల్ అంతే!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం ఫేం పరుశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. రౌడీ హీరో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది.. ఏంటి కథ అనేది ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ హీరో.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో తొలిసారిగా విజయ్ తో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జోడి కట్టింది. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా...శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం సమకూర్చగా.. హీరోయిన్ మాళవిక మోహనన్ ఫాదర్ కె.యూ.మోహనన్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్స్ ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఫ్యామిలీ స్టార్ పాటలే వినిపిస్తున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు మేకర్స్. మరోవైపు రౌడీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కాకుండా మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రష్మిక మందన్నాతో పాటు అమెరికన్ యాక్ట్రెస్ 'మరిస్సా రోజ్ గార్డన్' ఒక ముఖ్య పాత్రలో నటిస్తుందట. వీరితో పాటు.. మజిలీ మూవీ హీరోయిన్ 'దివ్యాంశ కౌశిక్' ఒక కీలక పాత్రలో నటిస్తుంది. రష్మిక మందన్న ఒక సాంగ్ లో గెస్ట్ అపిరెన్స్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ నలుగురు భామలతో ఫ్యామిలీ స్టార్ మరింత అందంగా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఇక ఆ ట్రైలర్ స్టార్టింగులోనే లుంగీలో విజయ్ ఫారిన్స్ తో కలిసి ఏంట్రి ఇస్తాడు. దేవుడికి దండం పెట్టుకుంటూ.. నువ్వు కొత్తగా నాకు బ్రేక్ లో ఇవ్వాల్సిందేమి లేదు.. ఉన్నదాన్ని చెడగొట్టకు అంటూ దండం పెట్టుకుంటాడు. ఇక మృణాల్ ఎంట్రీ కూడా పద్ధతిగా కనిపిస్తుంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ గా ఇంట్లో విజయ్ అందరికి కండిషన్స్ పెట్టడం.. ఇక విజయ్ భార్యగా మృణాల్ లుక్స్ నెక్ట్స్ లెవెల్ అంతే.
ఇక ట్రైలర్ లో విజయ్, మృణాల్ జోడి కెమిస్ట్రీ బాగుంది. నాకు ఏమైనా ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంటుందా.. లేక కెరియర్ ప్రాబ్లం ఉంటుందా.. నీ లైప్ లోకి రావడమే నాకు ప్రాబ్లం అంటూ మృణాల్ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఇక ఒక్కసారిగా ట్రైలర్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. చివర్లో కోపం తీరిపోతుందంటే నన్ను కోట్టవే బాబు అంటూ విజయ్ మృణాల్ తో చెప్తాడు. దానికి నిజంగానే మృణాల్ లాగి పెట్టి కొడుతుంది. ఇక చివర్లో ఎంత ప్రశాంతంగా ఉందో బాబు అంటూ విజయ్ డైలాగ్ చెప్పడం హైలెట్. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే.. గీత గోవిందం లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైరన్ లా అనిపిస్తుంది. మీరు ఈ ట్రైలర్ చూసి.. మీ రియాక్షన్ ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.


Click it and Unblock the Notifications











