తల్లి కోసం భారీ పెట్టుబడితో దేవరకొండ న్యూ బిజినెస్.. అలా ఉంటే మరిన్ని వస్తాయంటూ..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కేవలం సినిమాల్లోనే కాకుండా అందరి హీరోల తరహాలోనే ప్రత్యేకంగా కొన్ని వ్యాపారాలు కూడా మొదలుపెట్టాడు. ఇప్పటికే ఫ్యాషన్ ప్రపంచంలో రౌడీ వెర్ బ్రాండ్ తో మంచి గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో కూడా రాణించాలని ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా ఇటీవల విజయ్ దేవరకొండ తొలి రోజుల్లోనే భారీ పెట్టుబడితో ఒక వ్యాపారం మొదలు పెట్టాడు. అందుకు సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఇది తన తల్లి కోసమేనని ఎమోషనల్ గా స్పందించాడు. అంతేకాకుండా మరిన్ని వస్తాయని కూడా ఆమెకు వాగ్దానం చేశాడు

వరుస బాక్సాఫీస్ హిట్స్

వరుస బాక్సాఫీస్ హిట్స్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో ఒక చిన్న హీరో గా కనిపించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత మెల్లగా పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సినిమాతో నేటి తరం యువతకు మరింత దగ్గరయ్యాడు గీత గోవిందం టాక్సీవాలా సినిమాతో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా మరింత దగ్గరైన విషయం తెలిసిందే. ఎలాంటి సినిమా చేసినా కూడా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను.

లైగర్ సినిమాతో

లైగర్ సినిమాతో

ఇక ప్రస్తుతం చాలా మంది హీరోలు పాన్ ఇండియా మార్కెట్ కోసం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భరిగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కూడా అభిమానుల్లో అంచనాలు స్థాయిని అమాంతం పెంచేసింది.

 కొత్త వారికి అవకాశాలు ఇస్తూ..

కొత్త వారికి అవకాశాలు ఇస్తూ..

ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ చాలా మంది హీరోలు వారి కంటూ ప్రత్యేకంగా కొన్ని వ్యాపారాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ కూడా ఇదివరకే రౌడీ వేర్ బ్రాండ్ తో కొన్ని ఫ్యాషన్ దుస్తులను మార్కెట్లోకి విడుదల చేశాడు. ఆ బ్రాండ్ కు అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు లభించింది.

ఇక సొంత ప్రొడక్షన్ హౌస్ లో కూడా విజయ్ దేవరకొండ మంచి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఎక్కువగా కొత్త వారికి అవకాశాలు ఇస్తూ తనదైన శైలిలో మద్దతు ఇస్తున్నాడు.

నీ కోసమే అమ్మ.. AVD

నీ కోసమే అమ్మ.. AVD

ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన కెరీర్ లోనే భారీ పెట్టుబడితో సినిమా థియేటర్ ను మొదలు పెట్టాడు. తన తల్లిదండ్రులను సొంత ప్రాంతం అయినటువంటి మహబూబ్ నగర్ లో AVD థియేటర్స్ స్టార్ట్ చేశాడు ఏషియన్ సినిమాస్ తో కలిసి విజయ్ దేవరకొండ థియేటర్స్ ను స్థాపించడం జరిగింది. ఇక తన తల్లి పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఒక స్పెషల్ ఫొటోను కూడా షేర్ చేసుకున్నాడు.

పుట్టినరోజు శుభాకాంక్షలు ముమ్ములు. ఇది నీకోసం! AVD. మీరు వ్యాయామం చేసి, ఆరోగ్యంగా ఉంటే, నేను మరింత కష్టపడి మీకు మరిన్ని జ్ఞాపకాలను ఇస్తాను "అని కొత్తగా ప్రారంభించిన AVD సినిమాస్ లో ఉన్న తన తల్లి ఫొటోను విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

Recommended Video

Love Story Movie Success Meet | Naga Chaitanya | Sai Pallavi
లవ్ స్టోరితో మొదలు..

లవ్ స్టోరితో మొదలు..

ఇక థియేటర్ లో మొదటి సినిమాగా లవ్ స్టోరీ ప్రదర్శించడం విశేషం. ఒకప్పుడు శేఖర్ కమ్ముల సినిమాల్లో అవకాశం కోసం ఎంతగానో ప్రయత్నాలు చేసినా విజయ్ దేవరకొండ చివరికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో ఒక చిన్న నెగటివ్ పాత్రలో కనిపించాడు ఇక ఇప్పుడు విచిత్రంగా ఆ దర్శకుడు తెరకెక్కించిన సినిమాను తన సొంత థియేటర్లో ప్రదర్శిస్తుండడం విశేషం. అందుకు సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X