The Family Star Teaser: లీటర్ పెట్రోల్ కొట్టిస్తావా? కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌లా రౌడీబాయ్

అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ బాయ్ గా మారిన విజయ్ దేవరకొండ గుంచి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ చిత్రాలే అయినా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడీ కుర్ర హీరో. అదిరిపోయే కథలతో వస్తూ.. అందులో తన మేనరిజాన్ని చూపిస్తూ అమ్మాయిల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకున్నాడు. కానీ గత కొంత కాలంగా ఈయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా తెగ నిరాశలో కూరుకు పోయారు. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈరోజు విడుదల అయింది. అదెలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న తాజా సినిమానే ది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై.. దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే గోపి సుందర్ సంగీతం ఈ సినిమాకు అందిస్తుండగా.. కె యు మోహనన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు, పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

Vijay Devarakonda New Movie The Family Star Teaser Outnow Check Details

ముఖ్యంగా ఈ సినిమాలోనే ఐరనే వంచాలా ఏంటి, నందనందనా సాంగ్ అయితే యూట్యూబ్ ను షేక్ చేశాయి. సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేశాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. అందులో విజయ్ అచ్చమైన ఫ్యామిలీ మాన్ లా కనిపించారు. లుంగీ కట్టి.. రేషన్ బియ్య కోసం ఆయన పెట్టే పరుగులు అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు.

టీజర్ ప్రారంభం అవడమే.. లుంగీ పైకెత్తి ఓ సంచి, ఆధార్ కార్డు చేత పట్టుకుని రేషన్ బియ్యం కోసం పరుగులు పెట్టడం హైలెట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఆయన ఫైట్ చేయడం చూపించారు. ఇక ఆ తర్వాత పూజ చేసి, అట్లు వేస్తూ కనిపించారు. అలాగే పెట్రోల్ బంక్ వద్ద ఒక్క చుక్క పెట్రోల్ ను కూడా వదలకుండా కొట్టించుకుంటూ కనిపించి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా ప్రాజెక్టు వర్క్ చేస్తూ, చిన్న పిల్లలు ఉన్న చోచే ఓ వ్యక్తి తల బద్దలు కొడుతూ తనలోని మాస్ యాంగిల్ ను కూడా చూపించాడు.

Vijay Devarakonda New Movie The Family Star Teaser Outnow Check Details

ఇక చివరల్లో అయితే... హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కనిపించడం.. బస్టాప్ వద్ద ఆమె ఏవండీ అని పిలవడం అదిరిపోయింది. ఆ పిలుపుకు పడిపోయిన విజయ్ తెగ ఎగ్జైట్ అవుతాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడగా... కాలేజీకి వెళ్లాలి డ్రాప్ చేస్తారా అని అడగ్గా... లీటర్ పెట్రోల్ కొడితే డ్రాప్ చేస్తానని చెప్పి తనలోని అసలైన ఫ్యామిలీ మాన్ ను చూపించాడు రౌడీ బాయ్. ఇలా ఈ టీజర్ ఎండ్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X