twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    VD 12: ఆ దర్శకుడితో విజయ్ దేవరకొండ న్యూ ప్రాజెక్ట్ అఫీషియల్.. రంగంలోకి త్రివిక్రమ్!

    |

    టాలీవుడ్ రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వణ దర్శకత్వంలో తెరపైకి రానున్న ఆ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ టాలెంటెడ్ హీరో మరో కొత్త సినిమాను కూడా మొదలు పెట్టడానికి రెడీ అయ్యాడు.

    విజయ్ 12వ సినిమాను ఒక యువ డైరెక్టర్ తో చేయబోతున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా మరో క్లారిటీ ఇచ్చారు. ఊహించిన విధంగా విజయ్ ఒక పాత్రలో కనిపించబోతున్నారు. ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ వివరాలలోకి వెళితే..

    రేంజ్ అస్సలు తగ్గలేదు

    రేంజ్ అస్సలు తగ్గలేదు

    విజయ్ దేవరకొండ గత ఏడాది లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ పాన్ ఇండియా సినిమా విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. విజయ్ దేవరకొండ అందులో చాలా కష్టపడి వర్క్ చేశాడు కానీ సినిమా మాత్రం పూర్తి స్థాయిలో మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయినప్పటికీ రౌడి స్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు.

    జెర్సీ దర్శకుడితో 12వ సినిమా

    జెర్సీ దర్శకుడితో 12వ సినిమా

    ఇక విజయ్ దేవరకొండ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మాత్రం మరింత ఎక్కువ స్థాయిలో ఫోకస్ చేస్తున్నట్లుగా అర్థమవుతొంది. ఈ ఏడాది విజయ్ మరికొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టబోతున్నాడు. ఇక విజయ్ దేవరకొండ తన 12వ సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చాడు. గత కొంతకాలంగా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లుగా క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే.

    త్వరలోనే షూట్

    త్వరలోనే షూట్

    మొత్తానికి కొద్దిసేపటి క్రితమే విజయ్ దేవరకొండ తన 12వ సినిమాకు సంబంధించి అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చేసాడు. జెర్సీ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరపైకి తీసుకురాబోతున్న విజయ్ దేవరకొండ 12వ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.

    ఇంట్రెస్టింగ్ లైన్

    అయితే విజయ్ దేవరకొండ 12వ ప్రాజెక్టు డిఫరెంట్ ఎమోషనల్ యాక్షన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు ఒక స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడున్నానో నాకు తెలియదు - అనామక గూఢచారి.. అంటూ పోస్టర్ లో ఒక లైన్ కూడా హైలెట్ చేశారు. ఇక ఈ ప్రాజెక్టు డిఫరెంట్ ఎమోషన్ తో తెరపైకి రాబోతున్నట్లు విజయ్ దేవరకొండ కూడా తెలియజేశాడు.

    త్రివిక్రమ్ కూడా

    త్రివిక్రమ్ కూడా

    ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాను హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అలాగే శ్రీకార స్టూడియోస్ అనే కొత్త ప్రొడక్షన్ హౌస్ తో పాటు త్రివిక్రమ్ హోం బ్యానర్ ఫార్చునర్ 4 సినిమాస్ కూడా నిర్మాణంలో భాగం కానుంది. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య మరొక ప్రొడ్యూసర్ గా ఈ సినిమాకు వర్క్ చేయబోతున్న ఉండడం విశేషం. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Vijay devarakonda new project vd12 official update with interesting poster
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X