అర్ధాంతరంగా ఆగిపోయిన తెలుగు చిత్రాలివే.. విజయ్, పవన్ కల్యాణ్‌లతో పాటు వాళ్లవి కూడా ఉన్నాయిగా!

చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ఒక్క హిట్టు వచ్చిందంటే చాలు ఆ తర్వాత వారి షెడ్యూల్ ను బిజీ చేసేసుకుంటారు. సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగినా ఫర్వాలేదు కానీ.. ముందు అయితే డైరెక్టర్, హీరోల కాంబో కుదుర్చుకుని లైన్ లో పెట్టుకుంటారు. ఇలా చాలా మంది హీరో, హీరోయిన్లు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం వారు తీసే సినిమా ఫ్లాప్ గా మారితే మాత్రం ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న చిత్రాలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇలా చాలా సినిమాలు అనౌన్స్ మెంట్ తోనే ఆగిపోతుంటాయి. మరికొన్ని అయితే కొంత కాలం షూటింగ్ జరిగిన తర్వాత ఆపేస్తుంటారు. వాటికి కారణాలు బయటకు రాకపోయినా సినిమా ఆగిపోయిందని మాత్రం అందరికీ అర్థం అవుతుంటుంది.

అయితే టాలీవుడ్ లో ఈ మధ్య ఇలా చాలానే సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలతో పాటు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు కూడా ఉండడం గమనార్హం. అయితే ఈ హీరోలకు సంబంధించిన రెండు రెండు చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. వీరే కాకుండా మరికొంత మంది స్టార్ హీరోల సినిమాలు కూడా ఇలాగే ఆగిపోయాయి. అయితే ఈ సినిమాలు ఏవి, ఎవరెవరివి ఎన్నెన్ని చిత్రాలు ఆగిపోయావనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vijay Devarakonda Pavan Kalyan And Other Top Heroes Movies Stopped on Midway Check Details

ముందుగా పవన్ కల్యాణ్ హీరోగా.. క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమా మొదలైంది. కానీ కొంచెం షూటింగ్ జరుపుకోగానే ఆగిపోయింది. పవన్ కల్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాలు కూడా చేయడంతో ఇలా మధ్యలో కాస్త బ్రేక్ వచ్చింది. కొంతమంది అయితే ఈ సినిమా పూర్తిగా క్యాన్సిల్ అయిందంటూ చెప్పుకొస్తున్నారు చూడాలి మరి. ఇదే కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయింది.

మరోవైపు పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో జనగణమన సినిమాను ప్రకటించారు. కొంచెం షూటింగ్ కూడా జరిగాక ఇది ఆగిపోయింది. అయితే ఈ చిత్రం కంటే ముందు వీరి కాంబోలో వచ్చిన లైగర్ అట్టర్ ఫ్లాప్ అవడంతో.. ఈ ప్రాజెక్టును మధ్యలోనే ఆపేశారు. అలాగే విజయ్.. గౌతమ్ తిన్ననూరితో కిలసి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించినప్పటికీ.. దానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు.

జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర చేసేకంటే ముందు కొరటాల శివ అల్లు అర్జున్ తో కలిసి యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై ఓ చిత్రం చేయాల్సి ఉంది. ఆ సినిమాకు సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ ఆచార్య డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాను మధ్యలోనే ఆపేశాడు కొరటాల శివ. ఇదే కాకుండా అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ కాంబోలో దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఓ సినిమా చేయాల్సి ఉండగా..... అది ఆగిపోయిందని తెలుస్తోంది. అలాగే మంచు మనోజ్ ఇటీవలే అహం బ్రహ్మాసి అనే చిత్రంతో రాబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ సినిమాకు కూడా బ్రేక్ పడిందని తెలుస్తోంది.

Vijay Devarakonda Pavan Kalyan And Other Top Heroes Movies Stopped on Midway Check Details

యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ్, సుధీర్ వర్మ కాంబోలో మూడో సినిమా కూడ రాబోతున్నట్లు ప్రకచింటారు. హడావుడిగానే షూటింగ్ కూడా మొదలు పెట్టారు. కానీ వారం రోజులకే దాన్ని ఆపేశారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్.. టైగర్ నాగేశ్వరరావుతో పాటు కర్ణన్ సినిమాల రీమేక్ లు చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ వీటి ఊసెత్తట్లేదు నిర్వాహకులు. ఇవి మాత్రమే కాకుండా మాస్ మహారాజ రివితేజ హీరోగా, గోపీచంద్ మలినేని కాంబోలో నాలుగో చిత్రం రావాల్సి ఉంది. సినిమాను ప్రకటించినప్పటికీ.. బడ్జెట్ కారణాలతో ఈ సినిమాను మధ్యలోనే ఆపేశారు. ఇలా చాలా మంది స్టార్ హీరోల చిత్రాలు అర్ధాంతరంగానే ఆగిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X