అర్జున్ రెడ్డి లుక్కుతో పవన్ కళ్యాణ్ ఓల్డ్ పిక్.. విజయ్ దేవరకొండతో అలా సెట్టయ్యింది

టాలీవుడ్ బోల్డ్ మూవీ అర్జున్ రెడ్డి గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ పవర్ఫుల్ రోల్ తో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో ఇతర ఇండస్ట్రీలో కూడా వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యింది. విడుదలకు ముందే భారీగా హైప్ క్రియేట్ చేసిన ఆ సినిమాలో ప్రతి ఫ్రేమ్ యువతను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇక ఊహించని విధంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓల్డ్ ఫొటో ఒకటి అర్జున్ రెడ్డిలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్నో కాంట్రవర్సీల మధ్య

ఎన్నో కాంట్రవర్సీల మధ్య

2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అర్జున్ రెడ్డి ఎన్నో కాంట్రవర్సీల మధ్య నడిచింది. డైలాగ్స్ కూడా విమర్శలకు దారి తీశాయి. అయినప్పటికీ సినిమాను యూత్ ఎగబడి చూశారు. విజయ్ దేవరకొండ ఆ ఒక్క సినిమాతో యువతకు బాగా దగ్గరయ్యాడు. రౌడి బాయ్ బ్రాండ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది.

బాక్సాఫీస్ కలెక్షన్స్..

బాక్సాఫీస్ కలెక్షన్స్..

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంది. కేవలం 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 30కోట్లకు పైగా వసూళ్లను అందుకొని చిన్న సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాగా నిలిచింది. ఆ దెబ్బతో విజయ్ దేవరకొండ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

20 ఏళ్ళ క్రితం..

20 ఏళ్ళ క్రితం..

ఇక సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా అభిమానులకు బాగా నచ్చేసింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ కొన్ని సీన్స్ లో గెడ్డంతో హై వోల్టేజ్ లుక్కుతో కనిపించడం సినిమాకు ఒక మేజర్ ప్లస్ పాయింట్. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ 20 ఏళ్ళ క్రితం దిగిన ఒక పాత ఫొటోను అర్జున్ రెడ్డి తరహాలో ఉందని వైరల్ చేస్తున్నారు. రెండు ఫొటోలను పక్కపక్కనే సెట్ చేస్తున్నారు.

Recommended Video

Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
పవర్ స్టార్ ఫార్ములాతోనే..

పవర్ స్టార్ ఫార్ములాతోనే..

అనుకోకుండా సెట్టయినప్పటికి ఈ ఫొటో కరెక్ట్ గా ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కెరీర్ మొదట్లో రెగ్యులర్ గా డిఫరెంట్ యాంగిల్స్ లో తనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ను సెట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటి జనరేషన్ లో విజయ్ దేవరకొండతో పాటు చాలామంది యువ హీరోలు ఆ ఫార్ములాతోనే వెళుతున్నారు. ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమాతో బిజీగా ఉండగా, పవర్ స్టార్ మూడు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X