Liger Trailer Launch: బుల్లెట్ దిగిందా లేదా అంటూ విజయ్ దేవరకొండ పవర్ఫుల్ స్పీచ్
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కుతున్న మొట్టమొదటి సినిమా లైగర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హై వోల్టేజ్ యాక్షన్ ఫ్యాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లైగర్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఇక ముంబై నుంచి విజయ్ దేవరకొండ హైదరాబాదు రాగానే ఆడియన్స్ అతనికి బ్రహ్మరథం పట్టారు. ఇందిరా పార్కు వద్ద లైగర్ ర్యాలీ ఒక రేంజ్ లో జరిగింది. అలాగే సుదర్శన్ థియేటర్లో సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ విజయ్ దేవరకొండ మాట్లాడిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఈ రచ్చ ఏందిరా నాయనా..
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఉండగా ఆడియెన్స్ అందరూ కూడా రౌడీ రౌడీ అంటూ ప్రేమగా పిలుచుకున్నారు. ఇక ఈ మెంటల్ మాస్ ఏందిరా అయ్యా! అంటూ విజయ్ తన స్పీచ్ తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా ఈరోజు నాకు ఏమీ అర్థం కావడం లేదని అంటూ అసలు మీకు మా అయ్య తెల్వదు మా తాత తెలియదు. రెండేళ్లవుతోంది నా నుంచి సినిమా రిలీజ్ అయ్యి. ఆ ముందు రిలీజ్ అయిన సినిమా కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. అయినా ట్రైలర్ కు ఈ రచ్చ ఇందిరా నాయనా అంటూ విజయ్ దేవరకొండ మాట్లాడాడు.

థియేటర్ షేక్
అసలు మీ ప్రేమను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను మాటల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అంటూ లైగర్ తరహా నత్తితో విజయ్ దేవరకొండ ఆడియెన్స్ అందరికీ కూడా ఐ లవ్ యు చెప్పేసాడు. విజయ్ గంభీరమైన వాయిస్ తో ఐ లవ్ యు చెప్పడంతో సుదర్శన్ థియేటర్ మొత్తం కూడా ఫ్యాన్స్ అరుపులతో షేక్ అయిపోయింది.
డ్యాన్స్ మీ కోసమే
ఇక లైగర్ సినిమాను మొత్తం కూడా మీకు డెడికేట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో బాడీ పెంచడం, ఫైట్లు చేయడం డాన్స్ లు చేయడం అన్నీ కూడా మీకోసమే. అసలు డాన్స్ అంటే నాకు చాలా చిరాకు. ఆ డాన్స్ చేయడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే మా వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలి అని ఎంజాయ్ చేయాలి అని చేయడం జరిగింది.. అని విజయ్ అన్నాడు.
ఆ రోజు దేశమంతా సెలబ్రేషన్స్
ఇక ఆగస్టు 25వ తేదీన లైగర్ సినిమా విడుదలైనప్పుడు ప్రతి ధియేటర్ దగ్గర కూడా ఇదే సెలబ్రేషన్స్ కనిపించాలి. నేను ఇంతకుముందే గ్యారెంటీగా నమ్మకంతో చెప్పేసాను. ఆగస్టు 25 మొత్తం ఇండియా షేక్ అవుతుంది అంటూ ఆరోజు మనం అందరం కూడా ఆగ్ లాగా దేయింగే.. అనే డైలాగ్ తో కూడా విజయ్ విజిల్స్ వేయించాడు.

బుల్లెట్ దిగిందా లేదా..
అసలు మీరందరూ కూడా మధ్యలో కొంత ఫీలయ్యారు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ స్టైల్ లో చెప్పాలి అంటే ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం.. అని విజయ్ దేవరకొండ మరోసారి పోకిరి డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఫ్యాన్స్ అందరికి మరోసారి ఐ లవ్ యూ చెప్పిన విజయ్ మళ్ళీ కలుద్దాం అని ఫ్లయ్యింగ్ కిస్సెస్ ఇచ్చేశారు.


Click it and Unblock the Notifications











