మగ సింహానికి అడపులికి పుట్టినోడు.. పూరి టైటిల్ కొత్తగా ఉందే?

దర్శకుడు పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక అంశం చాలా కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీనియర్ దర్శకుడు ఎంచుకునే టైటిల్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. బద్రి సినిమా నుంచి ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు ప్రతి ఒక్క టైటిల్ తో పూరి మంచి హైప్ క్రియేట్ చేశాడు. ఇక నెక్స్ట్ విజయ్ దేవరకొండ సినిమాకు కూడా ఎవరు ఊహించని టైటిల్ సెట్ చేశాడని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ ఒక సినిమాను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. ముంబైలో మొదలైన ఆ ప్రాజెక్ట్ కు లాక్ డౌన్ కారణంగా బ్రేకులు పడ్డాయి. త్వరలోనే మళ్ళీ స్టార్ట్ చేయనున్నారు. మొదట ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ అనుకున్నప్పటికి ఎందుకో దాన్ని వదిలేశారు. ఇక ఇప్పుడు కొత్త తరహా టైటిల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. 'లైగర్' అనే టైటిల్ సినిమాకు కరెక్ట్ గా సెట్టవుతుందని ఇటీవల చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Vijay devarakonda puri Jagannath upcoming movie title is liger

లైగర్ అంటే.. మగ సింహానికి ఆడ పులికి క్రాస్ బ్రీడింగ్ వలన పుట్టే పిల్లనే లైగర్ అంటారు. ఆ విదంగా రెండు వైల్డ్ ఎనిమాల్స్ ని గుర్తు చేసేలా క్యారెక్టర్ ని డిజైన్ చేశాడట పూరి. దీంతో లైగర్ అనే టైటిల్ నే ఫిక్స్ చేయాలని విజయ్ దేవరకొండ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు పూరి జగన్నాథ్. సినిమా నెక్స్ట్ ఇయర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X