సరిలేరుపై విజయ్ దేవరకొండ.. అలాంటివి కనిపిస్తే దయచేసి చెప్పండి.. మహేష్ బాబు రిక్వెస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో అంచనాలను మోసుకొస్తూ.. తెచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఎఫ్2 లాంటి భారీ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి చేసిన చిత్రం సరిలేరు.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబును ఇది వరకు ఎన్నడూ చూపించని విధంగా డిజైన్ చేశామని, ఆయన క్యారెక్టర్, మాడ్యులేషన్ ఇలా అన్నీ కూడా కొత్తగా ఉంటాయని దర్శకుడు పదే పదే చెబుతూ వచ్చాడు. అయితే ఈ మూవీ టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక అందరికీ అంచనాలు పెరిగిపోయాయి.

డైలాగ్‌లు ఫేమస్..
సరిలేరు నీకెవ్వరు టైటిల్ పెట్టినప్పటి నుంచి సినిమాపై హైప్ పెరుగుతూనే వస్తోంది. పోస్టర్లతో మధ్యమధ్యలో బజ్ క్రియేట్ చేసిన యూనిట్.. టీజర్‌తో అంచనాలను అమాంతం చేయగా.. ట్రైలర్ వచ్చి వాటిని రెట్టింపు చేశాయి. టీజర్‌లో బేరాలేవమ్మా అనే డైలాగ్ ఫేమస్ అయితే.. ట్రైలర్‌లో బొమ్మ దద్దరిల్లిపోద్ది అనే పంచ్ డైలాగ్ ఫేమస్ అయింది.

నిజంగానే బొమ్మ దద్దరిల్లింది..
మహేష్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉన్న సరిలేరు సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రివ్యూలు సైతం సినిమాను పాస్ చేసేశాయి. ఇక సంక్రాంతి బరిలోకి ఈ మాత్రం టాక్‌తో దిగితే సూపర్ స్టార్ రేంజ్ బాక్సాఫీస్ మోత మోగాల్సిందే. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రతీ అభిమాని బొమ్మ దద్దరిల్లిపోయిందని అనాల్సిందే. ఆ రేంజ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.

ఈ మూవీపై టాలీవుడ్ స్పందన..
రివ్యూలు, సోషల్ మీడియాలో పబ్లిక్ టాక్ ఇలా ప్రతీ ఒక్క చోటా సరిలేరుపై పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే శ్రీనువైట్ల, హరీష్ శంకర్, వివి వినాయక్, బాబీ లాంటి వారు స్పందించారు. సరిలేరు విజయం సాధించినందుకు చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ కూడా చెప్పారు.
విజయ్ దేవరకొండ కామెంట్స్..
తాజాగా ఈ మూవీపై విజయ్ దేవరకొండ కామెంట్ చేశాడు. ఈ మూవీ సక్సెస్ అయినందుకు చిత్రయూనిట్ విషెస్ తెలిపాడు. మహేష్ బాబుకు, రష్మిక మందాన్నకు ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి, దేవీ శ్రీ ప్రసాద్, రత్నవేలును స్పెషల్‌గా ప్రస్థావించాడు.
పైరసీ లింక్స్ కనిపిస్తే చెప్పండి..
సరిలేరు బొమ్మ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంలో చిత్రయూనిట్ ఆనందంగానే ఉంది. అయితే ఈ క్రమంలోనే పైరసీ బారిన పడకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. పైరసీ లింక్స్ కనిపిస్తే తమకు తెలియజేయండి ఫ్యాన్స్‌ను మహేష్ బాబు కోరాడు. ఈ మేరకు మహేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications










