twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డియర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ అదేనా.. వేసవిలో బరిలోకి!

    |

    విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ గా, కార్మిక నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. గీత గోవిందం, టాక్సీవాలా లాంటి చిత్ర విజయాలతో డియర్ కామ్రేడ్ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గీత గోవిందం తర్వాత మరోమారు విజయ్, రష్మిక ఈ చిత్రంలో రొమాన్స్ చేయబోతున్నారు.

    డియర్ కామ్రేడ్ విడుదల గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని వేసవి బరిలో దించేందుకు నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే 22న డియర్ కామ్రేడ్ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వరుస విజయాలతో సెన్సేషనల్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో కొత్త ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడు.

    Vijay Devarakondas Dear Comrade movie release date

    ఈ చిత్రంలో రష్మిక మహిళా క్రికెటర్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ సంస్థ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శత్వంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో విజయ్ 8 ఏళ్ల పిల్లాడికి తండ్రిగా నటిస్తాడని సమాచారం.

    English summary
    Vijay Devarakonda's Dear Comrade movie release date
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X