'డియర్ కామ్రేడ్' టీజర్ రిలీజ్ డేట్ ఇదే!

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ గా, కార్మిక నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. గీత గోవిందం, టాక్సీవాలా లాంటి చిత్ర విజయాలతో డియర్ కామ్రేడ్ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన మరోమారు ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తోంది.

భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ప్రకటించారు. డియర్ కామ్రేడ్ చిత్ర టీజర్ ని మార్చి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశాడు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ కామ్రేడ్స్ మీరంతా రెడీగా ఉన్నారా అని ట్విట్టర్ లో టీజర్ రిలీజ్ డేట్ పోస్ట్ చేశాడు.

Vijay Devarakondas Dear Comrade Teaser release date

దీనితో దక్షణాది అన్ని భాషల్లో ఈ చిత్రం విడుదలవుతున్నట్లు అర్థం అవుతోంది. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మేలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మహిళా క్రికెటర్ పాత్రలో కనిపిస్తుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X