ఆ నా***కు కామన్ సెన్స్ లేదు .. ఔరంగజేబు గాడిని లాగిపెట్టి, విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

ఎప్పుడు సరదాగా, నవ్వుతూ , నవ్విస్తూ మాట్లాడుతూ తాను ఉన్న ప్లేస్‌ను ఆహ్లాదకరంగా మార్చేస్తారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. అలాంటిది ఈ యువ నటుడు తొలిసారి మైక్ అందుకోగానే పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఇక ఊరుకునేది లేదని సరైన గుణపాఠం నేర్పించాల్సిందేనంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ఆయన ఎవరికీ వార్నింగ్ ఇచ్చారు? ఎందుకు కంట్రోల్ తప్పారు. ఈ వివరాల్లోకి వెళితే..

భూతల స్వర్గం జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 28 మందిని పొట్టనబెట్టుకున్న ఘటనతో భారతీయులు రగిలిపోతున్నారు. దేశాన్ని సవాల్ చేసిన ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాలని, వారి వెనకుండి ప్రోత్సహించిన పాకిస్తాన్‌ను వదిలిపెట్టొద్దంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా పాకిస్తాన్‌‌ను ఒంటరిని చేసే పనులు ప్రారంభించింది.

Vijay devarakonda sensational comments on Pakistan at retro pre release event

ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందం నుంచి తప్పుకోగా.. వాఘా - అట్టారీ బోర్డర్ మూసివేత, దౌత్య సిబ్బంది బహిష్కరణ, పాక్ జాతీయులకు వీసాల నిలిపివేత వంటి చర్యలు చేపట్టింది. భారత్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులు తక్షణం దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలు , డీజీపీలు విదేశీయులపై ఫోకస్ పెట్టారు. అయితే ఈ చర్యలు సరిపోవని దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావం సినీ పరిశ్రమపైనా పడింది. దాడిని ఖండిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమ కేంద్రానికి మద్ధతుగా నిలిచింది. పాకిస్తాన్ నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులపై నిషేధం విధించడంతో వారు కూడా దేశాన్ని వీడుతున్నారు.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం రెట్రో. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది సూర్య కెరీర్‌లో 44వ చిత్రం కాగా.. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌‌లో శనివారం రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

యాంకర్ సుమ.. సూర్య, విజయ్‌లను ఫన్నీగా ఇంటర్వ్యూ చేశారు. టైం మిషన్‌లో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఎక్కడికి వెళ్తారు? ఏం చేస్తారు? అని సుమ ప్రశ్నించింది. దానికి విజయ్ స్పందిస్తూ.. భారతదేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలించిన రోజులకు వెళ్లాలని ఉందని వెరైటీ ఆన్సర్ ఇచ్చారు. ఒక్కో బ్రిటీష్ వాడి చెంప పగులగొట్టాలని ఉందని, ఛావా చూశాక కోపంతో రగిలిపోయానని ఔరంగజేబు కాలానికి వెళ్లి వాడిని కూడా లాగి పెట్టి పీకాలని ఉందని విజయ్ తెలిపారు. మనోళ్లని ఇబ్బంది పెట్టిన చాలా మందిని కలిసి ఇలాగే పీకాలని ఉందని వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత స్టేజ్ మీద మైక్ అందుకుని మరింత ఆగ్రహంతో ఊగిపోయారు విజయ్ .. కాశ్మీర్‌లో ఉగ్రదాడులు జరిగాయని, ఆ టెర్రరిస్టు నా***లకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పించి ఉంటే బ్రెయిన్‌వాష్ అవ్వకుండా ఉంటారని మండిపడ్డారు. కాశ్మీర్ ఇండియాదే.. కాశ్మీరీలు మనవాళ్లేనని, తాను రెండేళ్ల కిందట అక్కడికి వెళ్లానని చాలా బాగా చూసుకుననారని విజయ్ గుర్తుచేసుకున్నారు. పాకిస్తాన్ ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారని.. ఆ సంగతి చూడకుండా ఇండియాను ఏం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.

పాకిస్తాన్‌పై ఇండియా దాడి చేయాల్సిన అవసరం లేదని.. అక్కడి ప్రజలే ఆ దేశ ప్రభుత్వంపై దాడి చేస్తారని విజయ్ అభిప్రాయపడ్డారు. భారతీయులు ఐక్యంగా ఉండాలని .. జీవితంలో ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గమని ఆయన అన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X