Liger: విజయ్ దేవరకొండ క్షేమం కోసం తల్లి ఆరాటం.. ఏం చేశారో తెలుసా?

రౌడి స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకునేందుకు రెడీ అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరపైకి రానున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక గ్యాప్ లేకుండా విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో విజయ్ దేవరకొండ క్షేమం కోసం అతని తల్లి పడుతున్న ఆరాటం అంతా కాదు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆ వివరాలలోకి వెళితే...

బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఫుల్ యాక్షన్ హై వోల్టేజ్ సినిమా లైగర్ కోసం ఓవర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా మిగతా ఇండస్ట్రీలోని ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూడాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో పెరుగుతున్న బజ్ చూస్తేనే అర్థమవుతుంది. సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోతోంది.

Vijay devarakonda shared his mother love and protection photos viral

ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది విజయ్ దేవరకొండ కెరియర్ లోనే ఉన్న అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. అయితే ఈ క్రమంలో విజయ్ దేవరకొండ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ఇక అతని తల్లి దేవరకొండ మాధవి కూడా కొడుకు క్షేమం కోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నట్లు అర్థమవుతుంది.

ఈ నెల మొత్తం భారతదేశం అంతటా పర్యటించడం.. చాలా ప్రేమను పొందడం దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. కానీ అమ్మ మాకు దేవుడి రక్షణ అవసరమని భావిస్తుంది. కాబట్టి పూజలో మనందరికీ ఈ పవిత్రమైన బ్యాండ్‌లు. ఇప్పుడు మేము మా పర్యటనను కొనసాగిస్తున్నప్పుడు ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది.. అని కూడా విజయ్ వివరణ ఇచ్చారు. విజయ్ తో పాటు అనన్య పాండేకు కూడా విజయ్ తల్లి ఆప్యాయంగా రక్ష తాడును కడుతున్నారు. ఎంతైనా అమ్మ ప్రేమ చాలా గొప్పది అంటూ విజయ్ దేవరకొండ మరో స్థాయికి ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X