సమంతకి తెలియకుండా ఆ పని చేసిన విజయ్.. రొమాంటిక్ వీడియో వైరల్
రౌడి స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న మూవీ ఖుషి. ఈ రోమాంటిక్ మూవీకి శివ నిర్వాణ డైరెక్షన్ చేస్తున్నాడు. సమంత అనారోగ్యం సహా పలు కారణాలతో షూటింగ్ లేటయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. మే 9 విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఖుషి నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేసింది మూవీ టీమ్.
నా రోజా నువ్వే అంటూ సాగే ఈ పాట చాలా లవ్లీగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంది. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఖుషి చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతోనే సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టేసింది చిత్ర బృందం. కాగా, తాజాగా ఖుషి మూవీ సెట్స్ లో తీసిన ఓ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఇన్ స్టా రీల్ ను స్వయంగా హీరో వియజ్ దేవరకొండ తీశాడు. అది కూడా సమంతకు తెలియకుండా తీసిన ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే అంటూ సాగే పాటకు సమంతతో ఉన్న క్లిప్స్ పెట్టాడు. ఫస్ట్ ఫ్రేమ్ లో సమంత బ్లూ జీన్స్, వైట్ లోనెక్ టాప్ వేసుకుని ఉంటుంది.
తన హెయిర్ ను సరిచేస్తూ హెయిర్ స్టైలిస్ట్ బిజీగా ఉంటాడు. పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ మాత్రం సమంత వైపు రొమాంటిక్ లుక్ లో చూస్తుంటాడు. మరో ఫ్రేమ్ లో సమంత వెన్నెల కిషోర్ తో జోవియల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఎదురుగా కూర్చున్న విజయ్ తన ఎడమ చేతి బొటన వేలు చూపుడు వేలు ఒక దగ్గర చేర్చి క్యూట్ అనే అర్థం వచ్చేలా పెట్టాడు.
మరో షాట్ లో విజయ్, సమంత బైక్ పై కూర్చుని ఉంటారు. చుట్టూ సెట్ బాయ్స్ కనిపిస్తుంటారు. చివరి ఫ్రేమ్ లో సమంత ఎవరితోనో మాట్లాడుతుంటుంది. విజయ్ వెనక నుండి వచ్చి సామ్ ను గట్టిగా వాటేసుకుంటాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











