FAMILY STAR: ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ షాకే ఇది!

ఎలాంటి సినిమా నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలో హీరోగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. హీరోగా పరిచయమైన కొత్తలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. ఈ జోష్‌లోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.

ఆరంభంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. దీంతో ఈ సారి బిగ్ సక్సెస్‌ను కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఇందుకోసం తన 13వ చిత్రంగా 'ఫ్యామిలీ స్టార్'ను చేస్తున్నాడు. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డ విషయం తెలిసిందే.

Vijay Devarakonda Starrer FAMILY STAR Release on April 5th

సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయింది. త్వరలోనే మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసి.. సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసింది. కానీ, అనూహ్యంగా అప్పుడు రిలీజ్ చేయలేదు.

విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీ సంక్రాంతికి రాకపోవడంతో కొత్త రిలీజ్ డేట్‌పై ఎన్నో రకాల ప్రచారాలు వచ్చాయి. ఈ క్రమంలోనే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చేశాయి. కానీ, చిత్ర యూనిట్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది.

పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా వదిలింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ 'దేవర' మూవీ వాయిదా పడుతున్నట్లు కన్ఫార్మ్ అయినట్లైంది.

Vijay Devarakonda Starrer FAMILY STAR Release on April 5th

ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ - పరశురాం కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X