మాట నిలబెట్టుకున్న రౌడీ.. థ్యాంక్యూ బ్రదర్ అంటూ బన్నీ

విజయ్ దేవరకొండకు యూత్‌లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని స్టైలింగ్, యాటిట్యూడ్ ఇలా మిగతా హీరోలకంటే భిన్నంగానే ఉంటుంది. విజయ్ స్టైలింగ్‌కు టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అంతటి వాడే ఫిదా అయిపోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తనకూ ఓ డ్రెస్‌ను పంపించమని అప్పట్లో ఓ వేదికపై నేరుగా అడిగేశాడు బన్నీ.

రౌడీ బ్రాండ్ పేరుతో..

రౌడీ బ్రాండ్ పేరుతో..

రౌడీ పేరుతో బట్టల బ్రాండ్‌ను పెట్టి.. ప్రమోట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. వీటిపై యూత్‌లోనూ భారీగానే డిమాండ్ నెలకొంది. ఈ బ్రాండ్‌కు సంబంధించి ట్రేడింగ్ కూడా బాగానే ఉందని, బిజినెస్ కూడా వర్కౌట్ అయిందని తెలుస్తోంది. ఈ క్రమంలో వీటిని ఇంకా భారీ ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు.

తాజాగా విజయ్ స్టైలింగ్‌పై బన్నీ కామెంట్స్..

అల వైకుంఠపురములో ప్రమోషన్స్‌లో పాల్గొన్న బన్నీ.. విజయ్, రణ్‌వీర్ స్టైలింగ్‌పై కామెంట్ చేశాడు. చాలా కంఫర్ట్‌గా మరియు స్టైలిష్‌గా విజయ్ కాస్ట్యూమ్స్ ఉంటాయన్నాడు. కాని అలాంటి స్టైలిష్ డ్రస్‌లు ట్రై చేయడం తన వల్ల కాదన్నాడు. కొన్నాళ్ల క్రితం విజయ్ తనకు అతడి బ్రాండ్ కాస్ట్యూమ్స్‌ను పంపించాడు. కాని వాటిని ఇప్పటి వరకు ట్రై చేయలేదని బన్నీ అన్నాడు. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ కూడా మంచి కాస్ట్యూమ్స్‌ను ఉపయోగిస్తాడని అన్నాడు.

 తాజాగా మరి కొన్నింటిని..

తాజాగా మరి కొన్నింటిని..

తాజాగా విజయ్ దేవరకొండ.. బన్నీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ‘రౌడీ' బ్రాండ్‌కు సంబంధించిన దుస్తులను ఇస్తానని గతంలో హీరో అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ మాటిచ్చానని గుర్తుకు చేస్తూ.. తానే డిజైన్ చేసిన టీ షర్ట్స్‌ను బన్నీకి పంపించాడు. అంతే కాకుండా రేపు విడుదల కాబోతోన్న అల వైకుంఠపురములో చిత్రానికి విషెస్ చెప్పాడు.

థ్యాంక్యూ మై డియర్ బ్రదర్..

అయితే ఈ గిఫ్ట్‌ను తీసుకున్న అల్లు అర్జున్ మై డియర్ బ్రదర్ థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేశాడు. మాటిచ్చినట్లుగానే రౌడీ బ్రాండ్ దుస్తులను పంపావు.. వీటిని అల వైకుంఠపురములో సెలబ్రేషన్‌లో ధరిస్తానని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X