The Family Star: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్.. నందనా అంటూ మృణాళ్‌తో రొమాంటిక్‌గా!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా మారిన ఇతడు.. అదిరిపోయే సినిమాలతో వస్తూ.. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. కానీ గత కొంత కాలంగా వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తూ ఆయన అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా సరే హిట్టు కొట్టాలనే కసితో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు.
స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై.. దిల్ రాజు, వాసువర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి పస్ట్ రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న 13వ సినిమా కావడంతో ఈ చిత్రానికి VD13 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించగా, కె యు మోహనన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలోని సూపర్ రొమాంటిక్ పాటను విడుదల చేశారు. నందనందనా అంటూ సాగుతున్న ఈ పాట అదిరిపోయింది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు.
ఈ లిరికల్ సాంగ్ ముందులో విజయ్ దేవరకొండ కొట్టిన డైలాగ్ అయితే అదిరిపోయింది. ముఖ్యంగా ఆయన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేయి పట్టి లాగి మరీ.. ఏయి ఇటు రా.. నీ యబ్బ.. ఏంటి ఓయ్ అంటున్నావు అంటూ క్యూట్ గా అడుగుతాడు. వదులు వదులు అని మృణాల్ అంటున్నా పట్టించుకోకుండా.. కిటీకీకి అదిమి పట్టి అడ్డంగా నిల్చుంటాడు. ఏం చేస్తున్నావని హీరోయిన్ గా అనగా.. ఆమె కళ్లల్లోకి సూటిగా చూస్తూ.. చూస్కుంటావా లైఫ్ లాంగ్ నన్ను అని విజయ్ అడుగుతాడు.
దీనికి స్పందించిన మృణాల్ విజయ్ ను గోడకు నెట్టి అడ్డుగా నిలబడి మరీ.. అవును అని అంటుంది. తల ఊపినంత ఈజీ కాదు చూసుకోవడం అంటే అని హీరో అనగా.. చూసుకుంటానని అన్నాగా అంటూ మృణాల్ ఆయన కళ్లల్లో కళ్లు పేట్టి చూస్తుంది. ఇక ఆ తర్వాత పాట మొదలవుతుంది. ఏమిటిది చెప్పి చెప్పినట్టుగా ఏమీ చెప్పిందో అంటూ వస్తుంది. ఈక్రమంలోనే విజయ్ దేవరకొండ, మృణాల్ మధ్య చోటు చేసుకున్న పలు సంఘటనలను చూపిస్తారు.
మొదటి నుంచి చివరి వరకు ఈ పాట అద్బుతంగా సాగింది. నందనందనా అంటూ వచ్చినప్పుడు వచ్చే మ్యూజిక్ అయితే పాటకు ప్లస్ గా నిలిచిందని అర్థం అవుతుంది. బ్యూటిఫుల్ లిరిక్స్ తో వినడానికి చాలా వింపుగా ఉన్న ఈ పాటను మీరు కూడా ఓసారి విని ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











