బాత్ టబ్‌లో విజయ్.. ఇది ఆరంభమే ఇంకా ముందుంది.. రౌడీ స్టార్ పోస్ట్ వైరల్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏపాటిదో అందరికే తెలిసిందే. హైద్రాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వరుసగా రెండో ఏడాది కూడా టాప్ ప్లేస్ దక్కించుకుని తన సత్తాను మరోసారి చాటాడు. ఈ మేరకు విజయ్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

వరుస హిట్లతో..
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టి యూత్ స్టార్‌గా ఎదిగాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా అంతకంతకూ క్రేజ్ సంపాదించుకుంటూ పోతున్నాడు. స్టైల్ ఐకాన్‌గానూ మారి అందర్నీ ఆకర్షిస్తున్నాడు.

డిజాస్టర్లతో ఉన్నాసరే..
డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి డిజాస్టర్లతో ఉన్నాసరే మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ లిస్ట్‌లో రామ్ చరణ్ 2, ప్రభాస్ 4 స్థానాల్లో నిలిచారు. టాప్ 30లో విశ్వక్‌సేన్ చివరి స్థానాన్ని దక్కించుకున్నాడు.

ప్యాన్ ఇండియన్ స్టార్‌గా..
విజయ్ దేవరకొండకు ప్యాన్ ఇండియాపై బాగానే మోజు పెంచుకున్నట్లు కనిపిస్తోంది. తదుపరి చేయబోయే సినిమాలన్నీ జాతీయ స్థాయిలో ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ (వర్కింగ్ టైటిల్) మూవీని చేస్తున్నాడు. ఇది ప్యాన్ ఇండియా లెవెల్‌లో చేస్తున్నాడు.
Recommended Video
బాత్ టబ్‌లో విజయ్..
తాజాగా విజయ్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నాకెంతో సంతోషంగా ఉంది.. మీరిచ్చే ప్రేమను ఫీల్ అవుతున్నాను.. మీరిచ్చే ప్రేమను తిరిగిస్తాను.. రాసి పెట్టుకోండి.. ఇది కేవలం ఆరంభమే.. మీ అందరి కోసం ఈ ఏడాదిలో ఇంకెన్నో రాబోతోన్నాయ'ని ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











