నాకు అలాంటివన్నీ నచ్చవు.. కానీ తప్పదంటోన్న రౌడీ హీరో
సినిమా విజయాలన్నీ తెచ్చిన ఫేమ్ ఒకెత్తు అయితే.. యాటిట్యూట్‌తో వచ్చిన క్రేజ్ మరొక ఎత్తు. తనకు మాత్రమే సొంతమైనటువంటి స్టైల్, బిహేవియర్‌తో యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.
వరుస హిట్లు, కొత్త కథాకథనాలతో సినీ ప్రేక్షకులను అలరిస్తోన్న విజయ్.. నిర్మాతగానూ విజయం సాధించేందుకు సిద్దమయ్యాడు. తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడిని.. హీరోగా నిలబెట్టేందుకు నిర్మాతగా మారాడు విజయ్. తరుణ్ భాస్కర్ హీరోగా రాబోతోన్న మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

టీజర్, ట్రైలర్‌తో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న చిత్రయూనిట్ పాటలతోనూ మంచి స్పందననే తెచ్చుకుంటోంది. తాజాగా మరో పాటను విడుదల చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు నిర్మాత విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. సాధారణంగా తనకు డ్యాన్సులు వేయడం లాంటివి ఇష్టముండవు.. కానీ నా హీరో, డైరెక్టర్, టీమ్ కోసం నేనే హీరోలా చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే వేరే ఎవ్వరూ చేయరు. మన జీవితాలకు మనమే హీరోలా ఉండాలి.నీ కథకు నువ్వే హీరో అంటూ ట్వీట్ చేశాడు. నీ కథను నువ్వే హీరో అనే పాట రేపు సాయంత్రం 6.03గంటలకు రిలీజ్ కానున్నట్లు తెలిపాడు.


Click it and Unblock the Notifications











