Kushi: విజయ్ దేవరకొండ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్.. ఖుషి అఫీషియల్ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక పాయింట్ డిఫరెంట్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. నటుడుగా కూడా అతను సినిమా సినిమాకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని డిఫరెంట్ సినిమాలు అతని నుంచి రాబోతున్నట్లుగా లైనప్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఓ వర్గం ఆడియన్స్ ఖుషి సినిమా కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ పై విజయ్ దేవరకొండ క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

దెబ్బ పడినా.. రేంజ్ తగ్గలేదు
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకొని సినిమా సినిమాకు తన మార్కెట్ను కూడా పెంచుకుంటూ వెళుతున్నాడు. లైగర్ సినిమాతో మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినప్పటికీ కూడా అతని రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో హై రేంజ్ లోనే వైరల్ అవుతుంది.

షూటింగ్ అప్డేట్
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సమంత కథనాయకగా నటిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ గా ఈ సినిమాను దర్శకుడు తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా 70 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. ఇక మిగిలిన భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు

పాజిటివ్ బజ్
ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఎక్కువ పోస్టర్లు కూడా రాలేదు. అయినప్పటికీ కూడా ఈ సినిమాపై మంచి బజ్ అయితే ఉంది. అందులోనూ పవన్ కళ్యాణ్ ఆల్ టైం బెస్ట్ అయినటువంటి ఖుషి అనే టైటిల్ ను ఈ సినిమాకు కూడా సెట్ చేయడం విశేషం.

సమంత క్లారిటీ ఇవ్వడంతో..
అయితే ఖుషి సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారా అని ఓవర్గం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సమంత ఆరోగ్యం బాగో లేకపోవడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక మొత్తానికి సమంత ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేందుకు డేట్స్ కూడా ఫైనల్ చేసుకుంది.
స్పెషల్ పోస్టర్ తో రిలీజ్ డేట్
ఇక ఖుషి సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై మొత్తానికి విజయ్ దేవరకొండ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. సమంతకు బాల్కనీలో ఉండగా ఆమె చెయ్యి అందిస్తున్నట్లు ఉన్న స్పెషల్ పోస్టర్ ను విడుదల చేస్తూ సినిమాను సెప్టెంబర్ 1 తేదీన సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విడుదల విషయంలో మార్పులు ఉండవు అని అర్థమవుతుంది. అలాగే విజయ్ దేవరకొండ ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద లవ్ స్టోరీ తో సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు కూడా అనిపిస్తోంది. మరి ఖుషి సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











