For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Liger STRIKING ANNOUNCEMENT: విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్.. దాని గురించే చెబుతారా!

  |

  కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను చేస్తూ.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో.. దీని ద్వారా భారీ హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే 'అర్జున్ రెడ్డి' రూపంలో మరో భారీ సక్సెస్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో విజయ్ స్టార్‌గా ఎదిగిపోయాడు. అనంతరం 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఇతగాడు.. ఆ వెంటనే 'టాక్సీవాలా'తో మరో హిట్‌ను కూడా దక్కించుకున్నాడు. దీంతో అతడి కెరీర్‌ గ్రాఫ్‌తో పాటు మార్కెట్ కూడా జెట్ స్పీడుతో దూసుకెళ్లింది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

  ఆరంభంలోనే పలు విజయాలను అందుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీనికి కారణం ఈ యంగ్ హీరో కొంత కాలంగా వరుస పరాజయాలు చవి చూస్తూ నిరాశ పరుస్తుండడమే. ఈ మధ్య కాలంలో 'నోటా' 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడీ యంగ్ టాలెంటెడ్ హీరో.

  Vijay devarakondas Liger STRIKING ANNOUNCEMENT on Sep 27th

  చాలా కాలంగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తోన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతుండడంతో ఇప్పటి వరకూ టాకీ పార్ట్ మాత్రం కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే గోవాలో ఫైనల్ షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. అది కూడా శరవేగంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 'లైగర్' మూవీ నుంచి ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. దీంతో అందరిలోనూ దీనిపై ఆసక్తి పెరిగిపోయింది.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లైగర్' మూవీ నుంచి తాజాగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. దీని ప్రకారం సెప్టెంబర్ 27 అంటే సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు స్ట్రైకింగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో బాక్సింగ్ రింగ్.. చుట్టూ లైట్స్ ఉన్నట్లు చూపించారు. ఇక, సోమవారం రాబోయే ప్రకటనలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే, షూటింగ్ గురించిన అప్‌డేట్ కూడా ఇస్తారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

  అందాలన్నీ చూపిస్తూ రెచ్చిపోయిన పవన్ హీరోయిన్: బట్టలు ఉన్నా లేనట్లే.. మరీ ఇంత దారుణంగానా!

  పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న 'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు చాలా రోజుల పాటు ఈ క్రీడలో శిక్షణ కూడా తీసుకున్నాడు. అలాగే, ఇందులో ఈ యంగ్ హీరో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

  English summary
  Tollywood Star Hero Vijay Devarakonda Now Doing Liger Movie Under Puri Jagannadh Direction. STRIKING ANNOUNCEMENT on Sep 27th From This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X