కింగ్డమ్ లీక్.. ఆ సీన్ సినిమాకే హైలెట్ గా.. ఏంటంటే?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా గత చిత్రాలు ఆశించిన మేర ఫలితాన్ని అందించలేదు. దీంతో నెక్ట్స్ రాబోయే చిత్రం కింగ్డమ్ పైన విజయ్ దేవరకొండ ఆశలు పెట్టున్నారు. మరోవైపు ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

20 శాతం బడ్జెట్ పెంచి మరీ..
విజయ్ దేవరకొండ కెరీయర్ లో తొలిసారిగా భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి భారీగానే ఖర్చు చేశారు. సితార ఎంట్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫర్ సినిమాస్, శ్రీకర స్టూడియోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. అయితే ఈ సినిమాను తొలుత 100 కోట్లతో బడ్జెట్ తో ప్రారంభించినా పూర్తి చేసే సరికి 20 శాతం బడ్జెట్ పెరిగిందని, మున్ముందు ఖర్చులన్నీ కలిసి సినిమా రిలీజ్ వరకు 150 కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చిస్తున్నట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు.

Vijay Devarankonda Gautam Tinnanuri s Kingdom Movie

ప్రమోషన్స్ లో నాగ వంశీ బిజీ..
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను విడుదల చేస్తూ మంచి ఫలితాన్ని అందుకుంటున్నారు యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ. ఇక నెక్ట్స్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ చిత్రం జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి నాగ వంశీ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు.

కింగ్డమ్ చిత్రంలో కీలక సన్నివేశం..
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన జెర్సీ చిత్రంతో చూపించిన రైల్వే సీన్ చాలా సెన్సేషన్ గా మారింది. ఇక అలాంటి సీన్ ఒకటి కింగ్డమ్ లో పెట్టారని నిర్మాత నాగ వంశీ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఆ సన్నివేశాన్ని కూడా వివరించడం హాట్ టాపిక్ గ్గా మారింది. ఇద్దరు అన్నదమ్ములు శ్రీలంకలో కలిసే సీన్ ఒకటి ఉంటుందని, అప్పుడు వాళ్లు మాట్లాడుకునే మాటలు ఎంతో ఎమోషనల్ గా ఉంటాయని, ప్రతి ప్రేక్షకుడిని కదిలిస్తుందని నిర్మాత నాగ వంశీ హామీనిచ్చారు.

కింగ్డమ్ వివరాలు..
విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ చిత్రంపైనే భారీ అంచనాలను పెట్టుకున్నారు. జూలై 31న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను షురూ చేసే పనిలో బిజీగా ఉన్నారు. విజయ్ కు డెంగీ ఫీవర్ రావడంతో కాస్తా ఆలస్యంగా ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. సత్య దేవ్ అన్న పాత్రను పోషించారు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X