ఫ్రాన్స్‌లో విజయ్ దేవరకొండతో యంగ్ లేడీ ఎంజాయ్.. అన్నీ కొత్త అనుభవాలే అంటూ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, యంగ్ లేడీ ఇజబెల్ లీట్ ఇద్దరూ కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పిక్ లో నాలుక బయటకెళ్లబెట్టి విజయ్ దేవరకొండ, ఇజబెల్ లీట్ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. ఫ్రాన్స్ లోని ఓ అందమైన ప్రదేశంలో ఈ పిక్ కెమెరా లెన్స్‌కి చిక్కింది. కాగా ఈ ఫోటోని ఇజబెల్ లీట్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ అన్నీ కొత్త అనుభవాలే.. అని పేర్కొనడం గమనార్హం.

Vijay Deverakonda and Izabelle Leite enjoy in France

వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ మరికొద్ది రోజుల్లోనే దియా కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు విజయ్. అందులో ఒకటి క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసేందుకు ఏకంగా ముగ్గురు అందాల భామలు ఎన్నికవడం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. ఇక్కడే లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగనుంది.

అయితే తాజాగా ఆ ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన ఇజబెల్ లీట్.. తాను హీరో విజయ్ దేవరకొండతో సరదాగా గడిపిన క్షణం తాలూకు పిక్ ఒకటి షేర్ చేసింది. ఈ మేరకు 'ఈ రౌడీ నాకు కో-స్టార్.. నేనెంతో లక్కీ' అనే కాప్షన్ కూడా జతచేసింది. ''ఫ్రాన్స్‌లో గడిపిన ఆ సమయం ఎంతో అద్భుతం. అక్కడ అన్నీ కొత్త అనుభవాలే. నేను నిజంగా చాలా అదృష్టవంతురాలిని. అప్పుడే వాటిని మిస్ అవుతున్నా. ప్రస్తుతం నా కుటుంబంతో గడిపేందుకు బ్రెజిల్ చేరుకున్నాను'' అని ఈ సందర్భంగా ఇజబెల్ లీట్ తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇజబెల్ లీట్ ఈ సినిమాతోనే టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ రైటర్ గా కనిపిస్తాడట. మూడు కథలు ప్రేక్షకులకు చెబుతూ ఆ మూడింటిలోనూ తనే కథానాయకుడిగా కనిపించడం ఈ చిత్రం లోని అసలు ట్విస్ట్ అని అంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్ లీట్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X