చెరువు గట్టుపై విజయ్ దేవరకొండ, రష్మిక.. ఏం చేసారో చూస్తే పడిపడి నవ్వుడం ఖాయం..
గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకొంటున్నది. మేలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రమోషనల్‌లో భాగంగా ఈ సినిమా పాటలను రిలీజ్ చేశారు. కొన్ని పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారాయి.
డియర్ కామ్రేడ్ చిత్రంలోని ప్రస్తుతం నీ నీలి కన్నుల్లోనా అనే పాట యూత్‌ను ఆకట్టుకొంటున్నది. ఆ పాటను చెరువు గట్టున కూర్చొని మొబైల్ ఫోన్‌లో వింటూ విజయ్ దేవరకొండ, రష్మిక ఎంజాయ్ చేయడాన్ని కెమెరాలో బంధించారు. ఆ వీడియోను విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు.

నీ నీలి కన్నుల్లోనా పాట ప్రతీ వాతావరణానికి, ప్రతీ మూడ్‌కు, ప్రతీ సెట్టింగ్‌కు ఫర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ పాట ఎంత మధురంగా ఉందో వింటే మీకే తెలుస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











