HBD Vijay Deverakonda: తొలిసారి కత్తి పట్టిన విజయ్ దేవరకొండ.. యుద్ధం నాతోనే అంటూ!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే ఎంట్రీ ఇచ్చినా.. తనలోని టాలెంట్లను నిరూపించుకుని తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. అలా ఆరంభంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. తన రేంజ్‌ను అమాంతం పెంచుకున్నాడు. కానీ, ఈ మధ్యన వరుస పరాజయాలను చవి చూస్తూనే ఉన్నాడు.

సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న విజయ్ దేవరకొండ ఇటీవలే 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమాతో వచ్చి నిరాశ పరిచాడు. దీంతో ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేసే సినిమా షూట్‌లో కూడా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే విజయ్ దేవరకొండ తన మరో సినిమాను ప్రకటించాడు.

Vijay Deverakonda and Ravi Kiran Kola Movie Concept Poster Released

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాను 'రాజా వారు రాణి గారు' రవి కిరణ్ కోలా అనే యంగ్ డైరెక్టర్‌తో చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే రివీల్ చేసింది. దీంతో ఈ మూపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Vijay Deverakonda and Ravi Kiran Kola Movie Concept Poster Released

విజయ్ దేవరకొండ - రవి కిరణ్ కోలా కాంబినేషన్‌లో రాబోయే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అప్పుడే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీంతో దీని నుంచి వచ్చే అప్‌డేట్ల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి కాన్సెప్టు పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రెడ్ కలర్ బ్యాగ్రౌండ్‌తో ఓ చేయి కత్తిని పట్టుకున్నట్లు చూపించారు.

నేడు (మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఈ కాన్సెప్టు పోస్టర్‌ను వదిలారు. ఇందులో తొలిసారిగా అతడు కత్తి పట్టుకుని కనిపించాడు. ఇక, ఈ పోస్టర్‌పై 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే' అనే క్యాప్షన్‌ను కూడా ఉంచారు. తద్వారా ఈ సినిమా ఎంత వైల్డ్‌గా ఉండబోతుంది అనేది వెల్లడించారు. దీంతో ఈ మూవీపై హైప్ అమాంతం పెరిగిపోయింది.

Vijay Deverakonda and Ravi Kiran Kola Movie Concept Poster Released

ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పుడు శరవేగంగా సాగుతున్నట్లు తెలిసింది. ఇది పూర్తైన వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలుపెడతారని తెలుస్తోంది. ఇందులో నటించే నటీనటులు, పని చేసే టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే రివీల్ చేయబోతున్నారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X