Most Desirable Man 2019 విజయ్ దేవరకొండ.. ప్రభాస్, రాంచరణ్‌కు షాక్
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి హిట్లతో డాషింగ్, డైనమిక్ హీరోగా పేరు తెచ్చుకొంటున్న విజయ్ దేవరకొండ మరోసారి సత్తా చాటాడు. వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు పురుషులను పరిగణనలోకి తీసుకొని Most Desirable Man 2019 కోసం నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో విజయ్ దేవరకొండ టైటిల్‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకొన్నాడు. ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించిన రికార్డు సూపర్‌స్టార్ మహేష్‌బాబు పేరిట ఉంది. ఈ సర్వేలో రాంచరణ్, ప్రభాస్, రామ్ పోతినేని, వరుణ్ తేజ్ లాంటి హీరోలను పక్కన పెట్టి నెటిజన్లు విజయ్ దేవరకొండకు పట్టం కట్టడం విశేషం.
Most Desirable Man 2019 జాబితా
2వ స్థానంలో రాంచరణ్
3వ స్థానంలో రామ్ పోతినేని
4వ స్థానంలో ప్రభాస్
7వ స్థానంలో వరుణ్ తేజ్
8వ స్థానంలో సుధీర్ బాబు
9వ స్థానంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు
24వ స్థానంలో తరుణ్ భాస్కర్
30వ స్థానంలో విశ్వక్ సేన్ నిలిచారు.

ఈ జాబితాలో రెండుసార్లు టైటిల్ గెలిచిన మహేష్ బాబు పేరు లేకపోవడం, అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించకపోవడం షాకింగ్‌గా మారింది.
ఇక విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రిలీజైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ (లైగర్) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ తార అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











