Family Star Teaser Review కొబ్బరికాయ తేవడం మరిచా.. తలకాయ కొట్టేశా.. ఊరమాస్‌గా విజయ్ దేవరకొండ

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా స్టార్ డైరెక్టర్ పరుశురాంపేట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్.ఈ చిత్రం మృణాల్ థాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా సంక్రాంతి 2023 పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ను అభిమానులకు, సినీ ప్రేక్షకులకు అందించారు. ఈ టీజర్ ఎలా ఉందో మీరే ఒకసారి చూడండి..

ఫ్యామిలీ స్టార్ టీజర్ విషయానికి వస్తే.. పక్కాగా ఫ్యామిలీ మ్యాన్‌గా విజయ్ దేవరకొండ కొత్త అవతారంలో కనిపించాడు. అజయ్ ఘోష్ వాయిస్‌ వినిపిస్తూ.. సెటిల్ మెంట్ అంటే. లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడానికి, పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కు పంపించడాలు అనుకొన్నావా? అని ఎగతాళి చేస్తే.. భలే మాట్లాడుతారన్నా మీరు అంటూ విజయ్ దేవరకొండ లేచి.. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా.. ఐరన్ రాడ్ వంచాలా ఏంటి? అంటూ అజయ్ ఘోష్ మనిషిని గొడకు కొట్టే సీన్‌తో విజయ్ అదరగొట్టేశాడు.

Vijay Deverakondas Family Star teaser review

ఐరన్ రాడ్ వంచి.. అజయ్ ఘోష్ గుండాను కొట్టి.. అమాయకంగా.. చివర్లో మరిచిపోయాను బాబాయ్.. కంగారులో కొబ్బరి కాయ తేవడం మరిచిపోయాను. అందుకే తలకాయ కొట్టేశా అంటూ విజయ్ చెప్పిన డైలాగ్‌తో సినిమా హిట్టు కొట్టినంత ఫీలింగ్ కల్పించాడు. చివర్లో ఏమండి అంటూ మృణాళ్ థాకూర్ ఇచ్చిన లుక్ అదిరిపోయింది.

ఇక ఫ్యామిలీ స్టార్ టీజర్ చూసిన తర్వాత ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తు అనే విధంగా విజయ్ దేవరకొండ కనిపించాడు. మాస్ అవతార్‌లో సినిమా ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించాడు. టీజర్‌తోనే సంక్రాంతి బ్లాక్ బస్టర్ రేసులో నేను ఉన్నానని చెప్పకనే చెప్పాడు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ థాకూర్

సినిమాటోగ్రఫి: కేయూ మోహనన్
మ్యూజిక్: గొపి సుందర్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
ఎడిటర్: మార్తాండ్ వెంకటేష్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: వాసు వర్మ
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
రచన, దర్శకత్వం: పరుశురాం పేట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X