నిర్మాతగా మారిన విజయ దేవరకొండ..తరుణ్‌ భాస్కర్‌కు ఝలక్.. సినిమా టైటిల్ ఏమిటో తెలుసా?

టాలీవుడ్‌లో సంచలన కెరటంలా ఎగిసిన హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డికి ముందు రిలీజైన పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండ మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. పెళ్లి చూపులు సినిమా రిలీజ్‌కు ముందు ఎదురైన చేదు అనుభవాలు, గుణపాఠాలను దృష్టిపెట్టుకొన్న విజయ్ దేవరకొండ ఎప్పటికైనా నిర్మాతగా మారాలని ఒట్టు వేసుకొన్నాడట. అయితే ఇంతకు ఇప్పుడు ఏం జరిగిందంటే..

సంపాదించిన సేవింగ్స్‌తో

సంపాదించిన సేవింగ్స్‌తో

పెళ్లి చూపులు సమయంలో తీసుకొన్న నిర్ణయం పక్కన పెడితే ఓ అర్జున్ రెడ్డి, గీత గోవిందం, నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలో జెండా పాతేసిన విజయ్ దేవరకొండ నిర్మాతగా మారాడు. అయితే సొంతంగా హీరోగా సినిమాను చేయలేదు. తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా మార్చాడు. సంపాదించిన సొమ్ముతో సినిమాకు నిర్మాతగా మారాడు.

 తరుణ్ భాస్కర్‌కు ఝలక్

తరుణ్ భాస్కర్‌కు ఝలక్

కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తరుణ్ భాస్కర్, అనసూయ లాంటి తారలతో సినిమాను ప్రారంభించారు. ప్రారంభానికి ముందు జరిగిన సంభాషణ వీడియోను తాజాగా షేర్ చేసి ఆ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్‌ను ప్రకటించారు. వీడియోలో పేర్కొన్న ప్రకారం.. తరుణ్ భాస్కర్ గల్లీ క్రికెట్ ఆడుతుంటే.. విజయ్ దేవరకొండ ఫోన్ చేసి.. ఇప్పుడే కథ విన్నాను. ఆ సినిమాకు నేనే నిర్మాతగా ఉండాలనుకొంటున్నాను అంటే.. అందుకు తరుణ్ భాస్కర్ సమాధానం ఇస్తూ.. మంచి సినిమాలు తీయి.. ఇంతకు హీరో ఎవరు అంటే.. నీవే అంటూ ఝలక్ ఇచ్చాడు.

టైటిల్‌తో తికమక పెట్టి

టైటిల్‌తో తికమక పెట్టి

అయితే తరుణ్ భాస్కర్‌కు ఝలక్ ఇస్తూ.. సినిమా పేరు ఏంటో తెలుసా? ‘మీకు మాత్రమే చెబుతాను' అని విజయ్ దేవరకొండ అన్నాడు. నాకే చెప్పు.. మరెవరికీ చెప్పను అంటూ తరుణ్ భాస్కర్ అన్నాడు. కాదురా సినిమా టైటిల్ అదే.. ‘మీకు మాత్రమే చెబుతాను'. ఆ సినిమాలో హీరో కూడా నువ్వే అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

కొత్తదనం కోసం విజయ్ దేవరకొండ

కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాతగా మారిన విజయ దేవరకొండ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ వీడియోను వినోదాత్మకంగా షేర్ చేశారు. తాను నిర్మాతగా వ్యవహరించే సినిమాలో తరుణ్ ఒక హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే మీకు మాత్రమే చెబుతాను సినిమా గురుంచి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X